27.7 C
Hyderabad
May 14, 2024 10: 00 AM
Slider మహబూబ్ నగర్

బిఆర్ఎస్ కు బుల్లెట్ దిగింది: మెగారెడ్డి                                                                            

#cong

కాంగ్రెస్ పార్టీలోకి ఎప్పుడొచ్చామన్న సంగతి పక్కకు పెడితే కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందా లేదా అనేది లెక్కలోకి తీసుకోవాలని, బిఆర్ఎస్ పార్టీకి బుల్లెట్ దిగిందా లేదా అనే లెక్కలోనే ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త నాయకులు పనిచేయాలని వనపర్తి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే అభ్యర్థి  తూడి మేఘ రెడ్డి  పేర్కొన్నారు. బుధవారం వనపర్తి పట్టణంలోని లక్ష్మీ కృష్ణ గార్డెన్స్ లో ఏర్పాటుచేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ తల్లి  సోనియా గాంధీ, కాంగ్రెస్ అధిష్టానంతో పాటు  మాజీమంత్రి, ఏఐసిసి కార్యదర్శి క్రమశిక్షణ కమిటీ అధ్యక్షులు చిన్నారెడ్డి  సహకారంతో తనకు టికెట్టు లభించిందని వారి ఆశీర్వాదం మేరకే తాను మున్ముందు కూడా నడుచుకుంటానని ఆయన పేర్కొన్నారు. కేవలం 20 రోజులు కష్టపడితే ఐదు సంవత్సరాలు నేను పెద్ద జీతగాడిలా తమకు పని చేస్తానని ఆయన కార్యకర్తలకు హామీ ఇచ్చారు. ఈ ఉన్న తక్కువ సమయంలో ఎవరి గ్రామంలో వారే నిరంతరాయంగా పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ రాష్ట్ర పరిశీలకులు లక్ష్మీ మంజుల చంద్రశేఖర్ రెడ్డి సునీతాలు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ పరిశీలకులుగా మేము పనిచేస్తున్నామని మేము పని చేసే చోట లక్ష ఓట్ల మెజారిటీ వచ్చే విధంగా ప్రతి కార్యకర్త పని చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని పలు మండలాలు గ్రామాల నుంచి  మందికి పైగా బి ఆర్ ఎస్ పా ర్టీకి చెందిన నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి నియోజకవర్గ నాయకుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన తూడి మేఘా రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 10 తేదీన వేసే నామినేషన్కు నియోజకవర్గ పరిధిలోని ప్రతి ఒక్క గ్రామం నుంచి అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పార్టీ శ్రేణులు తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వనపర్తి ఎంపీపీ కిచ్చారెడ్డి, మాజీ జెడ్పిటిసిలు టి రవీందర్ రెడ్డి, రమేష్ గౌడ్, మాజీ ఎంపీపీ శంకర్ నాయక్, క్యామ వెంకటయ్య,  రమణ,  సర్పంచులు రాధాకృష్ణ, జయంతి, సతీష్, వెంకటస్వామి  బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్ బ్రహ్మచారి, షకీల్ జిల్లా మైనారిటీ ఉపాధ్యక్షులు, కేశవులు జిల్లా కాంగ్రెస్ జర్నల్ సెక్రెటరీ, మాజీ సర్పంచులు సత్యశీల రెడ్డి, సురేష్,  మాజీ ప్రజాప్రతినిధుల, కార్యకర్తలు, నాయకులు  పాల్గొన్నారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

అంకితా భండారీ మృతదేహం వెలికితీత

Satyam NEWS

విలేజ్ డెవలప్ మెంట్: రాజుల గ్రామాన్ని సందర్శించిన ఎంపీవో

Satyam NEWS

ఎస్ సి, ఎస్ టి, రజక కుటుంబాలకు నిత్యావసరాలు

Satyam NEWS

Leave a Comment