29.7 C
Hyderabad
May 4, 2024 06: 21 AM
Slider విజయనగరం

అక్కడ రాజ్యాంగ దినోత్సవం ఇలా జరిగింది..!

#ConstitutionalDay

రాజ్యాంగ నిర్మాత ఎవరంటే డా.బీ.ఆర్. అంబేద్కర్ అని టక్కున ఎవరైనా చెబుతారు. అది అమలులోకి ఎప్పుడు వచ్చిందంటే జనవరి 26 అని చెబుతారు. మరి ఆ రాజ్యాంగ ఎప్పటి నుంచి అమలు అయింది అంటే చాలా మందికి తెలియదు. అదే నవంబర్ 26వ తేదీ.

ఈ రోజును రాజ్యాంగ దినోత్సవంగా పాటించాలని  కేంద్ర ప్రభుత్వం 2015 వ తేదీన నిర్ణయించింది. అప్పటి నుంచీ అన్ని జిల్లాల్లో ప్రభుత్వ పరంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తోంది.  

ఇందులో భాగంగా రాష్ట్రంలో ని విజయనగరం జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ఆడిటోరియంలో రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమం జరిగింది. సరిగ్గా ఇదే రోజున అంబేద్కర్ రచించిన రాజ్యాంగం రూపుదిద్దుకుంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ తన సఃదేశాన్ని చెబుతూ అధికారులచే ప్రతిజ్ఞ చేయించారు.

ఈ ప్రతిజ్ఞ లో అదనపు కలెక్టర్ వెంకటరావు ,మరో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, రెవెన్యూ అధికారి గణపతిరావు, నగర మున్సిపల్ కమీషనర్ వర్మ ,జిల్లా సమాచార పౌరసంబంధాల అధికారి రమేష్ ,సహాయ అధికారులు హాజరయ్యారు.

Related posts

గ్రామాల్లో ప్రగతిని సాధించడమే పల్లె ప్రగతి లక్ష్యం

Satyam NEWS

ఘనంగా అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు

Satyam NEWS

ఫారం 6, 8 లు త్వరగా పరిష్కరించాలి

Satyam NEWS

Leave a Comment