39.2 C
Hyderabad
April 28, 2024 14: 02 PM
Slider ఖమ్మం

ఫారం 6, 8 లు త్వరగా పరిష్కరించాలి

#video

పెండిoగ్‌ ఫారం`6, 8 దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించి జాబితాను అప్‌లోడ్‌ చేయాలని జిల్లా కలెక్టర్‌ వి.పి.గౌతమ్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నుండి రిటిర్నింగ్‌, సహాయ రిటర్నింగ్‌ అధికారులు, తహశీల్దారులు, ఎంపిడి.ఓలతో పెండిరగ్‌ దరఖాస్తులు, మద్యం బెల్ట్‌ షాపులు, కొత్తగా పెల్లిలు ఆయి అత్తగారి ఇంటికి వచ్చిన కోడళ్ల ఓటు వివరాలపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ ఎంతమంది ఓటర్లు షిఫ్ట్‌ అయింది, డూప్లికేట్‌ ఓటర్లు వివరాలుఅడిగి తెలుసుకున్నారు.

కళ్యాణలక్ష్మి, శాదిముబారక్‌ నివేదిక ప్రకారం పోలింగ్‌ కేంద్ర పరిధిలో ఎంతమంది క్రొత్త కోడళ్లు వచ్చింది, వారి ఓటు, వారి తల్లిగారి గ్రామంలో ఉందా, లేదా క్రొత్తగా వచ్చిన అత్తగారి గ్రామానికి మారిందా చూడాలన్నారు. షిఫ్టెడ్‌, డూప్లికేట్‌ ఓటర్ల జాబితా తయారు చేయాలన్నారు. బెల్ట్‌షాపులకు మధ్యం అందించే వైన్‌షాపులను గుర్తించి తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఖచ్చితంగా అమలు అయ్యెల ప్రత్యేక దృష్టిసారించాలని, ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటించాలని, ప్రచార సంబంధ హోర్డింగులు, పోస్టర్లు, గోడ వ్రాతలు తొలగించాలని ఆయన తెలిపారు. పోలింగ్‌ కేంద్రాలను సందర్శించి సౌకర్యాలను పరిశీలించాలని కలెక్టర్‌ తెలిపారు.

వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్‌ డి.మధుసూదన్‌ నాయక్‌, జిల్లా పరిషత్‌ ముఖ్యనిర్వహణాధికారి వి.వి.అప్పారావు, మాస్టర్‌ ట్రైనర్‌ కె.శ్రీరామ్‌, కలెక్టరేట్‌ సూపరిండెంట్స్‌ మదన్‌గోపాల్‌, సత్యనారాయణ, మీనన్‌, రాంబాబు, రంజిత్‌ తదితరులు పాల్గొన్నారు.

Related posts

విశాఖలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అరెస్ట్

Satyam NEWS

తహసిల్దార్ ఆఫీసు భద్రతకు కొల్లాపూర్ పోలీసుల చర్యలు

Satyam NEWS

గుజరాత్ సర్కార్ లో సమూల మార్పులు..?

Sub Editor

Leave a Comment