38.7 C
Hyderabad
May 7, 2024 17: 36 PM
Slider శ్రీకాకుళం

సమగ్ర శిక్షలో ఉద్యోగుల తొలగింపు లేదు

#ContractEmployees

సమగ్ర శిక్ష ఒప్పంద పొరుగు సేవల ఉద్యోగస్థులను తొలగిస్తున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని శ్రీకాకుళం జిల్లా సమగ్ర శిక్ష ఒప్పంద పొరుగు సేవల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గంగు వెంకటరమణ, ఎల్.వి.వెంకటరమణ తెలిపారు. శ్రీకాకుళం జిల్లా లో సర్వ శిక్ష అభియాన్ లో కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ లో పని చేస్తున్న వివిధ విభాగాల ఉద్యోగులను తొలగిస్తున్నారని కొన్ని పత్రికలలో (సత్యం న్యూస్ లో కాదు) వార్తలు వచ్చాయి.

దీనితో ఉద్యోగులు అందరూ ఆందోళన చెందుతున్నారు. అయితే దీనిపై ఎవరూ ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని వారన్నారు. ప్రతి ఏడాది ఏప్రిల్ 29న తొలగింపు ఉత్తర్వులు ఇస్తారని, ఒక రోజు గ్యాప్ తో మే 1 నుండి రీ ఎంగేజ్ ఉత్తర్వులను ఇస్తారని వారు అన్నారు. ఈ సారి కూడాఅందరికీ రీ ఎంగేజ్  ఉత్తర్వులు ఇచ్చిన జిల్లా ప్రాజెక్టు అధికారి, విద్యాశాఖ అధికారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వారు వెల్లడించారు.

జిల్లా సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగుల సంఘ అధ్యక్ష కార్యదర్శులు గంగు వెంకటరమణమూర్తి  గుండ బాల మోహన్ లుండు వెంకటరమణ సంఘ సభ్యులు సిహెచ్ శ్రీనివాసరావు సుజా వాణి శ్రీ లక్ష్మి జయలక్ష్మి హేమ బిందు సత్యనారాయణ తదితరులు ఈ వివరణ ఇచ్చారు.

Related posts

కుట్టు శిక్షణ శిబిరాన్ని ప్రారంభించిన బీజేపీ నాయకులు

Satyam NEWS

పాలేరు అసెంబ్లీ నుండి సిపిఎం పోటీ

Satyam NEWS

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డికి పోలీసు అధికారుల వత్తాసు

Satyam NEWS

Leave a Comment