40.2 C
Hyderabad
May 5, 2024 15: 57 PM
Slider ఖమ్మం

ప్రజలపై వంట గ్యాస్‌ భారం

#cpm

సామాన్యులపై మళ్ళీ పెను భారం పడిరదని సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు విమర్శించారు.  ఖమ్మం నగరంలోని సరిత క్లినిక్‌ సెంటర్‌ వద్ద పెంచిన వంట గ్యాస్‌ ధరలను తగ్గించాలని కోరుతూ సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం, మోడీ దిష్టి బొమ్మ దగ్దం కార్యక్రమం జరిగింది. పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్‌ అధ్యక్షతన జరిగిన నిరసన కార్యక్రమంలో నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ ఇప్పటికే నిత్యావసరాల ధరలన్నీ మండిపోతుంటే ఇప్పుడు గ్యాస్‌  సిలిండర్‌ ధరను పెంచటం దారుణమని విమర్శించారు. గృహ వినియోగానికి ఉపయోగించే సిలిండర్‌ పైన 50/-రూ.లు, వాణిజ్య వినియోగం పైన 350/- పెంచి సామాన్యులకు బిజెపి ప్రభుత్వం గ్యాస్‌ వాతలు పెట్టిందని విమర్శించారు. మోదీ హయాంలో 13 సార్లు గ్యాస్‌ ధరలు పెరిగాయని మండిపడ్డారు.

మహిళ దినోత్సవం సందర్భంగా దేశ మహిళలకు మోదీ కానుకగా దీనిని అభివర్ణించారు. రాష్ట్రాల్లో ఎన్నికలు అయిపొగానే గ్యాస్‌ ధరలు పెంచడం కేంద్రానికి ఆనవాయితీగా మారిందని అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటినుండి డొమెస్టిక్‌ గ్యాస్‌కు సంబంధించి వేగంగా గ్యాస్‌ ధరలు పెరుగుతున్నాయని. ఒక సారి గ్యాస్‌ ధరలు పెరుగుదలను గుర్తుచేసుకుంటే బీజేపీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో అంటే 2014లో రూ.414లు ఉందని, 2015లో రూ.606కు పెరిగిందని, 2016లో రూ.747కు, 2021లో రూ.819కు, 2022లో రూ.1150కు, తాజాగా 2023 మార్చి1న హైదరాబాద్‌ నగరం సహా వివిధ ప్రాంతాల్లో రూ.1170 దాటి 1200లకు చేరువ అయ్యిందని తెలిపారు.  ఒక పక్క ఎడతెరిపి లేకుండా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచి, మరో పక్క గ్యాస్‌ ధరలు పెంచడం సామాన్యులకు ఇబ్బందులు తెచ్చి పెడుతోందని. గతేడాది జూలై నుండి కాస్తంత స్థిరంగా ఉన్నట్టు కనిపించినా ఎవరూ ఊహించని విధంగా మళ్లీ కేంద్రం గ్యాస్‌ షాకిచ్చిందని, దీంతో వంటింట్లో గ్యాస్‌ మంటలు చెలరేగినట్టయిందని అన్నారు. అంతకంతకూ పెరుగుతున్న దేశ అప్పుతో పాటు తలసరి అప్పు, నిత్యావసర ధరలు కూడా అమాంతం పెరుగుతున్నాయని, ఇప్పటికే జీఎస్టీతో చాలా సరుకుల ధరలు పెరిగి కునారిల్లుతున్న దేశ జనాభాపై గ్యాస్‌ భారం అంతకంతకూ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. గడిచిన ఎనిమిదేండ్లుగా కేంద్ర బడ్జెట్‌లో పెట్రోల్‌ గ్యాస్‌ అధారిత సబ్సిడీలకు కేంద్రం మంగళం పాడిరదని విమర్శించారు.

2019లో లోక్‌సభ ఎన్నికల ముందు గ్యాస్‌ సబ్సిడీ దేశీయంగా సుమారు రూ.34వేల కోట్లుగా ఉండగా, ప్రస్తుతం రూ.5వేల కోట్లకు కుదించడం బట్టి గ్యాస్‌పై సబ్సిడీ ఎత్తేసినట్టేనని రుజువు అవుతోందని తెలిపారు.  గ్యాస్‌ ధరలు అంతకంతకూ పెంచుకుంటూ పోతుండటంతో చాలా మంది పేద, మధ్య తరగతి ప్రజలు గ్యాస్‌ కనెక్షన్‌ ఉన్నా రీఫిల్‌ నింపుకోలేని పరిస్థితులు కనిపిస్తున్నాయని, రానురాను గ్యాస్‌ వినియోగం కూడా చాలా వరకూ తగ్గిపోయే సూచనలు కనిపిస్తున్నాయని, ఒక వైపు నిత్యావసర ధరలు పెరుగుతుండటం, మరోవైపు  ఆదాయ వనరులు సన్నగిల్లడంతో అనివార్యంగా పేద, మధ్య తరగతి ప్రజలు కష్టాల్లోకి నెట్టబడుతున్నారని అన్నారు. ఇక కూలి పనులకు వెళ్లే వారి పరిస్థితి మరింత దారుణంగా ఉందని అన్నారు. ఇప్పటికే సతమతమవుతున్న సామాన్యులపై ఈ పెంపుదల భారంగా మారిందని,పెంచిన గ్యాస్‌ ధరలను వెంటనే ఉప సంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.ఈకార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాచర్ల భారతి, బొంతు రాంబాబు, వై.విక్రం, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు మాదినేని రమేష్‌, నందిపాటి మనోహర్‌, యర్రా శ్రీనివాసరావు, యస్‌. నవీన్‌ రెడ్డి, దొంగల తిరుపతిరావు, ఆర్‌.ప్రకాష్‌, యస్‌.కె.బషీర్‌, పట్టణ కార్యదర్శులు బోడపట్ల సుదర్శన్‌, భూక్యా శ్రీను, బత్తిన ఉపేందర్‌, జిల్లా నాయకులు మీరా, వజినేపల్లి శ్రీనివాసరావు, హిమామ్‌, సులోచన ,భాగం అజిత, రమేష్‌, శీలం వీరబాబు,  కార్పోరేటర్‌ వెల్లంపల్లి వెంకట్రావు, జిల్లా నాయకులు నర్రా రమేష్‌, యం.డి.గౌస్‌, బీబీ తదితరులు పాల్గొన్నారు.

Related posts

రానున్న రెండు రోజుల్లో వడగాలులు మరింత తీవ్రతరం

Satyam NEWS

ప్రొఫెసర్ జయ శంకర్ సార్ ఆశయ సాధన దిశగా పాలన

Satyam NEWS

జగజ్జనని

Satyam NEWS

Leave a Comment