40.2 C
Hyderabad
May 5, 2024 17: 12 PM
Slider హైదరాబాద్

లాక్ డౌన్ వల్ల తగ్గుతున్న కరోనా కేసులు

#SajjanarIPS

భౌతిక దూరం పాటించకుండా దుకాణాలు నడుపుతున్న షాపు యజమానుపైన కేసులు నమోదు చేసినట్లు సైబరాబాద్ సీపీ సజ్జనార్ వెల్లడించారు. కూకట్ పల్లి కేపీ.హెచ్.బి  కాలనీలోని పలు సెంటర్లలో ఈరోజు ఉదయం నుండి  ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్ తో కలిసి సీపీ పర్యటించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్ డౌన్ లో ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి బౌతిక దూరం పాటిస్తూ ఇచ్చిన సమయంలో నిత్యావసరాలు కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉదయం 10 గంటల తర్వాత అనవసరం రోడ్డు పైకి వస్తే వారి పై కేసులు నమోదు చేయడం తో పాటు  వాహనాలు ను సీజ్ చేస్తున్నట్లు సజ్జనార్ తెలిపారు. గత ఐదు రోజులుగా లాక్ డౌన్ వల్ల ప్రజల సహకారంతోనే కేసులు తగ్గాయి అన్నారు, ఇది ఇలానే కొనసాగిస్తే కరోనా  పైన విజయం సాధించవచ్చు  తెలియజేశారు.

Related posts

రెండు మండలాలకు రెండు నెలల నుంచి ఒకే తహసిల్దారా..!?

Satyam NEWS

ట్రాజెడీ: అదృశ్యమై అడవిలో శవంలా కనిపించిన సంజన

Satyam NEWS

Cricket Calendar:కొత్త ఆశలతో కొత్త సంవత్సరంలోకి…

Satyam NEWS

Leave a Comment