28.7 C
Hyderabad
April 26, 2024 07: 50 AM
Slider ముఖ్యంశాలు

ఆయుష్మాన్ భారత్ ను కేసీఆర్ ఎందుకు అమలు చేయడం లేదు?

#BJPVivek

రాష్ట్రంలో జనం పిట్టల్లా రాలుతుంటే  సీఎం కేసీఆర్ హుజూరాబాద్ రాజకీయాల్లో బిజీగా ఉన్నారని బీజేపీ నేత కోర్ కమిటీ నేత మాజీ ఎంపీ వివేక్ అన్నారు. ఇంతకంటే తుగ్లక్ పాలనా ఉంటుందాని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆయూష్మాన్ భారత్ ను అమలు చేసి ఉంటే ఇప్పటిదాకా కరోనా బారిన పడ్డవాళ్లలో 80 శాతం మందికి లాభం జరిగేదన్నారు.రాష్ట్రం మొత్తంలో ఈ స్కీం ద్వారా 30 లక్షలకు పైగా మందికి ఉపయోగం అయ్యే స్కీం ను ఎందుకు అమలు చేయట్లేదని ప్రశ్నించారు.

డిసెంబర్ 30 వ తేదీన రాష్టంలో  ఆయుష్మాన్ భారత్ ను అమలు చేస్తామని ప్రధానికి సీఎస్ తో చెప్పించిన కేసీఆర్ మాట తప్పారని ఆరోపించారు.

కరోనా బాధితులు భరించిన లక్షలాది రూపాయల కరోనా ట్రీట్ మెంట్ ఖర్చు మొత్తాన్ని రాష్ట్ర సర్కారే భరించి వాళ్లకు రీ అంబర్స్ చేయాలని డిమాండ్ చేసారు. ఏడాది నుంచి కరోనా చికిత్స కోసం అడ్డగోలుగా వసూలు చేసిన ప్రయివేటు హాస్పిటళ్ల పై చర్యలు తీసుకోవాలన్నారు.

రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ అమలు చేయనందుకు నిరసనగా, ఆరోగ్యశ్రీలో కరోనా చేర్చాలన్న డిమాండ్ తో ఈ నెల 19న రాష్ట్ర వ్యాప్తంగా అందరు ఇళ్లలోనే చేసే గరీబోళ్ల కోసం పార్టీ పిలుపులో భాగంగా దీక్ష ను విజయవంతం  చేయాలని పిలుపు నిచ్చారు. కరోనా నిబంధనలు, లాక్ డౌన్ గైడ్ లైన్స్ ను ఫాలో అవుతునే ఇండ్లలోనే ఉదయం 10 నుంచి మధ్యాప్నం ఒంటిగంట వరకు నిరసన దీక్ష జరుగుతుందని మాజీ ఎంపీ వివేక్ తెలిపారు.

Related posts

మహిళలను గౌరవించే చోటే అభివృద్ధి చెందుతుంది

Satyam NEWS

సైకో పాలన పోతేనే రాష్ట్రం అభివృద్ధి

Satyam NEWS

పామాయిల్ రైతుల పాలిట శాపంగా మారిన తెల్లదోమ

Bhavani

Leave a Comment