27.7 C
Hyderabad
May 4, 2024 07: 57 AM
Slider ముఖ్యంశాలు

కోవిడ్ నిబంధనలు పాటించని ప్రైవేట్ కళాశాలలపై డేగ కన్ను

#AdimulapuSuresh

రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు  పునః ప్రారంభం కానున్న సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర  విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు.

ఆదివారం సాయంత్రం గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చినకాకాని గ్రామంలోని  జిల్లా పరిషత్ పాఠశాల ను మంత్రి  సందర్శించారు. లాక్ డౌన్ అనంతరం పాఠశాలను పునఃప్రారంభిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు కోసం స్కూల్లో చేసిన ఏర్పాట్లను, జాగ్రత్త చర్యలును పరిశీలించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కరోనా నివారణకు ముందుస్తు చర్యలు చేపట్టిందని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు విషయంలో తగు జాగ్రత్తలు పాటిస్తున్నామని, ప్రైవేట్ కళాశాలలు నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవడంలో ఏమాత్రం వెనకడుగు వేయబోమని స్వష్టం చేశారు.

సీట్లు విషయములో కుత్రిమ ఇబ్బందులు సృష్టిస్తే ఆయా పాఠశాలలు,కళాశాలల చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని,ప్రైవేట్ కళాశాలలపై డేగ కన్ను పెట్టామని సీట్ల విషయంలో కృత్రిమ కొరత సృష్టిస్తే సహించేది లేదని మంత్రి హెచ్చరించారు.  

ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా కలెక్టర్ శ్యామ్యూల్ ఆనంద్,మంగళగిరి తహసీల్ధార్ రామ్ ప్రసాద్ తదితర అధికారులు పాల్గొన్నారు.

Related posts

దివ్యాంగుల ప్రధాన డిమాండ్ పై కలెక్టర్ కరుణించే నా !

Bhavani

బిడ్డ‌ల‌తో క‌న్న త‌ల్లుల ఆవేద‌న‌…భ‌ర్త‌ల కోసం నిరీక్ష‌ణ‌..!

Satyam NEWS

ప్రకాశం జిల్లాలో బైక్ మెకానిక్ దారుణ హత్య

Satyam NEWS

Leave a Comment