38.2 C
Hyderabad
May 1, 2024 22: 36 PM
Slider నల్గొండ

బిజెపి అనుసరిస్తున్న కార్మిక ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొట్టండి

#LabourWelfareBoard

కార్మికులు ఎన్నో త్యాగాలు, పోరాటాలు చేసి సాధించుకున్న భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డును రక్షించుకోవాలని, కేంద్ర ప్రభుత్వం వన్ మోర్ డు రద్దుకు చేస్తున్న కుట్రలను కార్మిక వర్గం తిప్పికొట్టాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కొలిశెట్టి యాదగిరి రావు పిలుపునిచ్చారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం కేంద్రంలోని వర్తక సంఘం భవనంలో ఆదివారం ఎస్.కె సైదా, గోవిందు అధ్యక్షతన జరిగిన భవన నిర్మాణ కార్మికుల సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న యాదగిరి రావు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ నవంబర్ 26న జాతీయ కార్మిక సంఘాల పిలుపు మేరకు దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని అన్నారు.

కరోనా నేపథ్యంలో అసంఘటిత రంగ కార్మికులైన భవన నిర్మాణ, హమాలి, ట్రాన్స్పోర్ట్, హోటల్, షాపు గుమస్తాలు తదితర కార్మికులు ఉపాధి లేక పస్తులు ఉంటున్నారని, కేంద్ర ప్రభుత్వం ప్రతి కార్మిక కుటుంబానికి పదివేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

కార్మిక చట్టాల సవరణ రద్దు చేయాలని, వెల్ఫేర్ బోర్డు నుండి దారి మళ్ళించి నా వెయ్యి కోట్ల రూపాయల నిధులను తిరిగి బోర్డు లో జమ చేసి, కార్మికుల సంక్షేమానికి ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. కౌన్సిల్ బోర్డులు రద్దుచేసి ఆయుష్మాన్ భారత్ లో విలీనం చేసి  నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని తీవ్రంగా విమర్శించారు.

ఈ కార్యక్రమంలో లో జిల్లా అధ్యక్షుడు రావులపెంట వెంకయ్య, ఉపాధ్యక్షుడు శీతల రోషపతి, జిల్లా ప్రధాన కార్యదర్శి  యలక సోమయ్య గౌడ్, భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు ఉప్పతల్ల గోవిందు, బంకా శ్రీనివాసరెడ్డి, పెద్దబ్బాయి,సైదులు,రామకృష్ణ, వెంకన్న, నరసింహారావు, ఏలియా, గోపి,వినాయకరావు తదితరులు పాల్గొన్నారు.

Related posts

లాక్ డౌన్ అమలుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలి

Satyam NEWS

ఎస్ సి ఎస్ టి చట్టం దుర్వినియోగం చేస్తున్న జగన్ ప్రభుత్వం

Satyam NEWS

నులి పురుగుల నివారణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

Satyam NEWS

Leave a Comment