39.2 C
Hyderabad
May 4, 2024 20: 45 PM
Slider మహబూబ్ నగర్

కొల్లాపూర్ ఆసుపత్రిలో కరోనా రాపిడ్ టెస్టులు

#KollapurHospital

కొల్లాపూర్ లోని  ప్రభుత్వ కమ్యూనిటి హెల్త్ సెంటర్ లో  కరోనా రాపిడ్  పరీక్షలు చేయనున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ భారత్ రావు తెలిపారు.

తీవ్రమైన గొంతు నొప్పి, జలుబు, దగ్గు, జ్వరం ఆయాసం, ఒళ్ళు నొప్పులు, వాసన, రుచి కోల్పోవడం లాంటి లక్షణాలు ఉంటే కరోనాగా భావించవచ్చునని, వైద్యుని పర్యవేక్షణలో ఐదు రోజుల వరకు మందులు వాడిన తర్వాత టెస్టులకు రావాలని ఆయన కోరారు.

ఇలాంటి లక్షణాలు ఉన్న వారికి ప్రతి రోజు కరోనా పరీక్షలు చేస్తామని ఆయన తెలిపారు. కొందరిలో  పై లక్షణాలు లేకున్నా కారోనా పాజిటివ్  ఉండవచ్చునని, ప్రస్తుతం కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి చెందింది కనుక ప్రతి ఒక్కరు స్వచ్చందంగా  కరోనా పరీక్షలు చేయించుకోవలసిన అవసరం  ఉందని ఆయన తెలిపారు.

కరోనా  పరీక్షకు  వచ్చేవారు ఆధార్ కార్డు కాంటాక్ట్ ఫోన్ నెంబర్ అడ్రస్ తో సహా హాస్పిటల్ కి వచ్చి తమ పేరు చిరునామాను రిజిస్ట్రేషన్ చేయించుకుని కరోనా పరీక్ష చేయించుకోవాలని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సూపరింటెండెంట్ డాక్టర్ భారత్ రావు కోరారు.

Related posts

రామప్ప కు యునెస్కో గుర్తింపు పై సీతక్క హర్షం

Satyam NEWS

రామోజీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

Satyam NEWS

ఆంధ్ర అధికారులతో తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుంటున్న కేసీఆర్

Satyam NEWS

Leave a Comment