33.2 C
Hyderabad
May 4, 2024 01: 46 AM
Slider రంగారెడ్డి

జర్నలిస్టులకు త్వరలోనే కరోనా వ్యాక్సిన్

#MinisterEtala

ప్రెస్, మీడియా వారికి కూడా వాక్సిన్ అందించాలని కేంద్రానికి నిన్ననే విజ్ఞప్తి చేశామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కార్మిక శాఖ మంత్రి మల్లా రెడ్డి తో కలిసి నేడు ఆయన శామీర్ పేట్ పోలియో చుక్కల కార్యక్రమం లో పాల్గొన్నారు.

త్వరలోనే జర్నలిస్టులకు కరోనా వ్యాక్సిన్ ఇస్తారని ఆశిస్తున్నామని మంత్రి ఈటల తెలిపారు. శామీర్ పెట్ హాస్పిటల్ ను త్వరలోనే ట్రామా కేర్ సెంటర్ గా తీర్చిదిద్దుతాం. రాజీవ్ రహదారి మీద ఆక్సిడెంట్స్ పెరిగాయి, గాయపడిన వారి ప్రాణాలు కపడతాం అని మంత్రి తెలిపారు.

0-5 సంవత్సరాల పిల్లలు అందరికీ పోలియో చుక్కలు వేయించాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ రోజు 38 లక్షల 31 వేల 907 మందికి పోలియో చుక్కలు వేస్తున్నాం. అందుకోసం 23,331 పోలియో బూత్ లు ఏర్పాటు చేశాం. 877 మొబైల్ టీమ్స్ ఏర్పాటు చేశాం. పోలియో డ్రాప్స్ పూర్తి అవ్వగానే కరోనా వాక్సిన్ కూడా వేస్తామని మంత్రి తెలిపారు.

Related posts

దేశం ముందుకు వెళ్లేందుకు ఇస్లాం మతచట్టాల మార్పు

Satyam NEWS

విజయోత్సవ ర్యాలీలు, బహిరంగ సభలు నిషేధం

Satyam NEWS

నిరుద్యోగ భారతం: రోజు రోజుకూ తగ్గుతున్న ఉద్యోగావకాశాలు

Satyam NEWS

Leave a Comment