38.2 C
Hyderabad
April 29, 2024 13: 47 PM
Slider ప్రపంచం

దేశం ముందుకు వెళ్లేందుకు ఇస్లాం మతచట్టాల మార్పు

#Dubai

దేశ ఆర్ధిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు, ప్రపంచ దేశాలతో పోటీ పడి ముందుకు వెళ్లేందుకు ఇస్లామిక్ పర్సనల్ లా లో మార్పులు చేసేందుకు దుబాయ్ సిద్ధపడుతున్నది.

మతపరమైన ఆంక్షల కారణంగా అందివచ్చిన అవకాశాలు కూడా కోల్పోతున్న తరుణంలో వాటిని సమీక్షించుకోవాల్సిన అవసరాన్ని యునైటెడ్ అరబ్ ఎమిరేట్సు గుర్తించింది. దీనికి అనుగుణంగా మార్పులు చేసుకోవాలని ముస్లిం మత పెద్దలు కొందరు ప్రతిపాదిస్తున్నారు.

వివాహం కాని యువతీయువకులు కలిసి ఉండటం, మద్యపానం విషయంలో ఎక్కువ సడలింపులు కల్పించడం, పరువు హత్యలను తీవ్ర నేరాలుగా పరిగణించడం లాంటివి మత పెద్దలు ప్రతిపాదించారని విశ్వసనీయంగా తెలిసింది.

 పాశ్చాత్యపోకడలు ఎక్కువగా అనిపిస్తున్నా కూడా ఇస్లామిక్ పర్సనల్ లాలో మార్పులు చేయాల్సిందేనని ఒక వర్గం మరింత బలంగా వాదిస్తున్నది.

ఈ మార్పులు చేయడం ద్వారా పర్యాటకులను ఎక్కువగా ఆకర్షించేందుకు వీలుకలుగుతుందని వారు భావిస్తున్నారు. ఇస్లామిక్ లీగల్ కోడ్ కారణంగా విదేశస్తులపై ఎక్కువగా కేసులు నమోదు అవుతున్నందున పర్యాటకంపై ప్రభావం పడుతున్నదని వారు గుర్తించి ఈ మార్పులు చేయాలని సిఫార్సు చేస్తున్నారు.

ఈ ప్రతిపాదలను ఎవరు చేస్తున్నారో చెప్పలేదు కానీ దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం అవుతున్నట్లు అధికార వార్తా సంస్థ వామ్ తెలిపింది.

Related posts

తొలి స‌ర్వ‌స‌భ్య స‌మావేశం లోనే సస్పెండ్ అయిన సూపర్ వైజర్

Satyam NEWS

సరిగ్గా మైనార్టీ వెల్ఫేర్ డే రోజు నే…విజయనగరం ఏఆర్ ఏఎస్పీ గా సాల్మన్ చార్జ్.

Bhavani

మళ్లీ గెలిపించండి: పట్టభద్రుల ఎంఎల్సీ అభ్యర్థి మాధవ్ విన్నపం

Satyam NEWS

Leave a Comment