Slider కడప

మునిసిపల్ ఎన్నికల వార్డుల విభజన ప్రక్రియ అక్రమం

bhatyala 07

రాజంపేట మునిసిపల్ ఎన్నికల వార్డుల విభజన ప్రక్రియలో గోల్ మాల్ జరగడంతో టీడీపీ కోర్టును ఆశ్రయించిందని కడప జిల్లా రాజంపేట టీడీపీ ఇంచార్జీ మాజీ ఎమ్మెల్సీ భత్యాల చెంగల రాయుడు అన్నారు. దీనిపై హైకోర్టు స్టే మంజూరు చేసిందని ఆయన వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం మీడియా సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజంపేట మున్సిపల్ కమిషనర్ వళ్ళు దగ్గర పెట్టుకొని నిజాయితీగా పని చేయాలి, రూల్స్ కు వ్యతిరేకం గా పనిచేసి అవకతవకలకు పాల్పడితే మేం న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని చెప్పారు.

చట్టాలను పాటించని అధికారులపై పోరాటానికి తమకు న్యాయ స్థానాలే దిక్కు అన్నారు. మున్సిపాలిటీలో వార్డుల విభజన ఓట్ల తొలగింపు, కేటాయింపు లో గోల్ మాల్ జరిగిందని, దీనిపై టీడీపీ కోర్టును ఆశ్రయించడం తో హై కోర్టు స్టే ఇచ్చిందని అన్నారు. వైసీపీ కి ప్రజలు ఒక్కసారి అవకాశం ఇచ్చినందుకు లబోదిబోమంటున్నారని, మరో అవకాశం ఇస్తే గుండుమీద బొచ్చుకుడా మిగలదని ఎద్దేవా చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజలు టీడీపీకి పట్టం కట్టేందుకు ఉత్సాహం గా ఉన్నారని అన్నారు.

Related posts

ఐదు గురు వరంగల్ వాసుల మృతదేహాలు లభ్యం

Satyam NEWS

రివెంజ్ థాట్స్: వాహనాలకు నిప్పుపెట్టిన మావోయిస్టులు

Satyam NEWS

కల్వకుంట్ల కుటుంబానికి లక్షల కోట్ల ఆస్థులేకడివి

Bhavani

Leave a Comment