38.2 C
Hyderabad
May 5, 2024 19: 41 PM
Slider ఖమ్మం

కల్వకుంట్ల కుటుంబానికి లక్షల కోట్ల ఆస్థులేకడివి

#Kalvakunt family

తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను సాకారం చేసేందుకు ప్రత్యేక రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇస్తే అది కల్వకుంట్ల కుటుంబానికి వరంగా మారిందని, కార్పొరేట్ శక్తులు, బడా నాయకులు, పెత్తందార్ల పాలనలో ప్రజలు నలిగిపోతున్నారని సీఎల్పీనేత మల్లు భట్టివిక్రమార్క, తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.

మధిర మండల పరిధిలోని దెందుకూరు గ్రామ సమీపంలోని శ్రీరస్తు ఫంక్షన్ హాల్లో జరిగిన చేరికల కార్యక్రమంలో దెందుకూరు గ్రామ సర్పంచ్ కోట విజయశాంతి, సొసైటీ ఛైర్మన్ కోటవెంకటకృష్ణ దంపతులతో పాటు పొంగులేటి అనుచరులు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల మధిర, ఎర్రుపాలెం, బోనకల్ మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, భట్టివిక్రమార్క సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువాలను కప్పుకున్నారు.

ఈ సందర్భంగా జరిగిన సభలో భట్టివిక్రమార్క మాట్లాడుతూ దేశంలో కార్పొరేట్ శక్తులు, రాష్ట్రంలో బిఆర్ఎస్ కు చెందిన బడానేతలు, పెత్తందార్లు రాష్ట్ర సంపదను దోచుకుంటున్నారన్నారు.

రాష్ట్రం 5లక్షల అప్పుల్లో కూరుకుపోయిందని, 9 ఏళ్ళ బడ్జెట్ నిధులు ఏమయ్యాయో తెలియని విధంగా రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి అంశాల పరిస్థితి ఉందన్నారు. సీఎం అబద్దపు మాయమాటలను నమ్మే పరిస్థితి లేదన్నారు.

ప్రజలకు వారి ఆకాంక్షలను నెరవేర్చే పార్టీ, వారికి సంక్షేమ, అభివృద్ధిని, సంపదను ప్రజలకు పంచే పార్టీ కాంగ్రెస్ అనేది స్పష్టమైందన్నారు. సీఎం కేసీఆర్ అవసరం కోసం ఏదైనా చేస్తాడని, పచ్చిమోసకారిగా ఇటీవల వామపక్ష సోదరులు ఓ పక్క చీ కొట్టగా, కేసీఆర్ భ్రమలో ఉండి ఆయన మోసపు మాటలతో ద్రోహానికి గురైన జిల్లా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా కేసీఆర్ వైఖరిని విమర్శించడం జరిగిందన్నారు.

రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుందని, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సమన్వయంతో కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాకముందు కేసీఆర్ కుటుంబానికి ఉన్న ఆస్తులెన్ని, ఇప్పుడు ఏ వ్యాపారాలు చేసారని లక్షలకోట్లు సంపాదించారని, ప్రజలను తొమ్మిదిన్నరేళ్ళుగా మాయమాటలతో మోసం చేస్తూ వస్తున్న కల్వకుంట్ల కుటుంబానికి మనమందరం చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటి కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ బిజెపితో కలిసి పనిచేస్తున్నదనేందుకు ఖమ్మంలో జరిగిన బిజెపి సభే నిదర్శనమన్నారు.

కాంగ్రెస్ పార్టీ ప్రజలకు సంక్షేమ పథకాలు డిక్లరేషన్ ను ప్రకటిస్తుంటే బిఆర్ఎస్ నేతల్లో, సీఎం కేసీఆర్ కి ఓటమి భయం పట్టుకున్నదన్నారు. సాధ్యంకాని హామీలంటూ విమర్శలు చేస్తూ పబ్బంగడుపుకుంటున్నారని విమర్శించారు. కేసీఆర్ 9 ఏళ్లకాలంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేక అబద్దాల తో ప్రజలను మభ్యపెడుతూ పాలన చేసాడని, ఇప్పుడు ఆయన మాటలను నమ్మే పరిస్థితి పోయిందని, ప్రజలు కేసీఆర్ గారడి మాటలు తెలుసుకుని ఇక ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యే విధంగా తీర్పును ఇవ్వనున్నారని అన్నారు.

నియోజకవర్గంతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకు పాత కొత్త శ్రేణులు సమన్వయంతో కలిసి పని చేయాలని కోరారు. ఏదైనా సమస్య ఉంటే తనకు గాని భట్టివిక్రమార్క కు గాని స్వయంగా కలిసి లేదా ఫోన్ ద్వారా వివరించి పరిష్కరించుకోవాలని సూచించారు.

కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మూడు మండలాల నుండి చేరికలు జరగగా, పొంగులేటి కి గజమాల తో పార్టీ శ్రేణులు భారీ ఎత్తున ఘనస్వాగతాన్ని పలికారు. భారీ మోటార్ సైకిల్ ర్యాలీని నిర్వహించారు.

మధిరలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకున్న పొంగులేటి శ్రీనివాస రెడ్డికి భట్టివిక్రమార్క సాదరంగా స్వాగతం పలకడంతో కాంగ్రెస్ కొత్త పాత కార్యకర్తలు నాయకుల్లో జోష్ కనిపించింది. సూరం శెట్టి కిషోర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ , మధిర నియోజకవర్గ నాయకులు డాక్టర్ కోటా రాంబాబు, సీనియర్ నాయకులు అయిలూరి వెంకటేశ్వర రెడ్డి , మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, రాయల నాగేశ్వరరావు, మూడు మండలాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Related posts

బిగ్‌బాస్‌3 నుండి శిల్పచక్రవర్తి ఔట్‌ ?!

Satyam NEWS

Atrocious: ఏపీలో మరో శిరోముండనం కేసు

Satyam NEWS

కడప జడ్పీ లో దేహశుద్ధి జరిగింది మరచిపోయావా నాని

Bhavani

Leave a Comment