మావోయిస్టులు మరోసారి పంజా విసిరారు.బీజాపూర్‌లోని కుత్రులో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. రోడ్డు నిర్మాణ పనులకు ఉపయోగిస్తున్న మూడు వాహనాలకు మావోయిస్టులు నిప్పు పెట్టటంతో అవి పూర్తిగా కాలిపోయాయి. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని విచారణ చేస్తున్నారు. దీనికి సంబందించిన పూర్తి విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.