29.7 C
Hyderabad
May 4, 2024 05: 18 AM
Slider మహబూబ్ నగర్

నాగర్ కర్నూల్ జిల్లాలో విజృంభిస్తున్న కరోనా వైరస్

#Nagarkurnool Corona Positive

నాగర్ కర్నూల్  జిల్లా  కల్వకుర్తి పట్టణంలో ని గాంధీనగర్ కాలనీలో ఒకరికి శనివారం కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. స్వల్ప అస్వస్థతతో ఇబ్బంది పడుతున్న గాంధీనగర్ వ్యక్తికి గత నెల 28న కరోనా పరీక్షలు నిర్వహించగా శనివారం కరోనా నివేదికలు రావడంతో అతని ప్రైమరీ కాంటాక్ట్స్ గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.

ఆయన ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కావడంతో రోజు హైదరాబాదు నుండి కల్వకుర్తికి జర్నీ చేసేవారని కాలనీవాసులు తెలిపారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నాగర్ కర్నూల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కొవిడ్-19 విధులు నిర్వహిస్తున్న  డాక్టర్ కు నేషనల్ రిపోర్టులో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని, పూర్తిస్థాయి నిర్ధారణకు మరోమారు కరోనా పరీక్షలకు రక్త నమూనాలను సేకరించి పంపించినట్లు డీఎంహెచ్ఓ సుధాకర్ లాల్ తెలిపారు.

అదేవిధంగా బిజినపల్లి మండలంలోని మంగనూరు గ్రామానికి చెందిన ఒక వ్యక్తికి హైదరాబాదులో కరోనా సోకినట్లు అతడు ఇటీవల గ్రామానికి వచ్చి వెళ్లినట్లు తెలిపారు. వీరు నలుగురికి సంబంధించిన ప్రైమరీ కాంటాక్ట్స్ ను గుర్తించే పనిలో నిమగ్నం అయ్యామని, కొవిడ్ విధులు నిర్వహిస్తున్న డాక్టర్ సంబంధించిన ప్రైమరీ కాంటాక్ట్స్ లో డీఎంహెచ్ఓ మరియు ఇతర వైద్యులు ప్రైమరీ కాంటాక్ట్స్ చెందిన వారిమంతా హోమ్ క్వారంటైన్ కు వెళ్తున్నట్లు డి ఎం హెచ్ ఓ సుధాకర్ లాల్ శనివారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు.

Related posts

ఇంటి అద్దెపై ఇక నుంచి 18 శాతం GST

Satyam NEWS

అజయ్ కల్లాం అసలు చదివే ఐఏఎస్ అయ్యావా?

Satyam NEWS

క్రీడల్లో అద్భుత ప్రతిభ కనబరచిన కానిస్టేబుల్ కుమార్తె

Satyam NEWS

Leave a Comment