27.7 C
Hyderabad
May 4, 2024 10: 11 AM
Slider హైదరాబాద్

నిర్భయంగా ఓటు వేయండి

CP Sajjanar

జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్, ఐపీఎస్ శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డి, ఐపీఎస్ ఇతర అధికారులతో కలిసి రాజేంద్రనగర్, మైలార్ దేవ్‌ పల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను సందర్శించి ప్రజలకు భరోసా కల్పించారు.

మైలార్దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోని కాటేదాన్, పద్మశాలిపురం, వాంబే కాలనీ, లక్ష్మీగుడా జంక్షన్ తదితర ప్రాంతాలను తిరిగి ప్రజలకు భరోసా కల్పించారు.

సీపీ వెంట ఎస్ఓటీ ఏడీసీపీ సందీప్, ఏడీసీపీ మాణిక్ రాజ్, ఏఎస్పీలు అఖిల్ మహాజన్, అక్షాన్ష్ యాదవ్, ఎస్ఓటీ, సివిల్, ఏ ఆర్ సిబ్బంది ఉన్నారు.

ప‌టిష్ట బందోబ‌స్తు సీపీ స‌జ్జ‌నార్‌

ఈ సంద‌ర్భంగా సీపీ మాట్లాడుతూ సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని 38 మున్సిపాలిటీలలోని 674 పోలింగ్ లొకేషన్స్ లోని 2569 పోలింగ్ స్టేషన్లలో డిసెంబర్ 1న నిర్వహించనున్నమున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పటిష్ట బందోబస్తు ను ఏర్పాటు చేశామన్నారు.

జీహెచ్ఎఎంసీ ఎన్నికల నిర్వహణకు సైబరాబాద్ పరిధిలో 13,500 మందితో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. జీహెచ్ఎఎంసీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తామన్నారు. అధికారులకు బందోబస్తు ఏర్పాట్లపై సూచనలు, సలహాలు ఇచ్చారు.

ప్రజలందరూ నిర్భయంగా, స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఎన్నికలకు సంబంధించి అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని డివిజన్లలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టామన్నారు. పది రోజులపాటు 24 గంటల పాటు పోలీసులు విధులు నిర్వహించి అన్ని ప్రాంతాల్లో నిఘా పెట్టామన్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పోలింగ్‌కు 2569 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని సీపీ తెలిపారు. ఎన్నికల పోలింగ్ బందోబస్తు పై నిత్యం అధికారులతో సంప్రదింపులు చేసి సమీక్షలు చేస్తున్నామన్నారు.

అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా ప‌క‌డ్భందీ ఏర్పాట్లు

సైబరాబాద్ పరిధిలో 770 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో ఇప్పటికే గుర్తించిన 243 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లలో/ సమస్యాత్మక ప్రాంతాలల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ బందోబస్తు ఏర్పాట్లు చేశామన్నారు. జీహెచ్ఎఎంసీ సర్కిల్ లో ఏసీపీ స్థాయి అధికారిని నియమించామని తెలిపారు. ప్రతీ లొకేషన్ లో ఇద్ద‌రు పోలింగ్ లొకేషన్ ఆఫీసర్లను ఏర్పాటు చేశామన్నారు. వీరు ఆయా ప్రాంతాల్లోని సమస్యలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు పంపించి నివేదించడంతో పాటు పోలింగ్ సరిగ్గా జరిగేలా సహకరిస్తారు. పది ప్రాంతాల్లో సీసీటీవీ మౌంటెడ్ వెహికిల్ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. వీటిద్వారా ఎన్నికల వేళ జరిగే పరిణామాలను కమాండ్ కంట్రోల్ సెంటర్ కు చేరవేస్తారన్నారు.

ప‌టిష్ట నిఘా ఏర్పాటు

నామినేషన్ల ప్రక్రియ, పోలింగ్, కౌంటింగ్ మొత్తం ఎన్నికల ప్రక్రియలపై పటిష్ట నిఘా ఉంచనున్నామన్నారు. పోలింగ్ రోజు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఓటర్లు ప్రశాంత వాతావరణంలో మున్సిపల్ ఎన్నికల్లో పాల్గొనేందుకు ఇప్పటికే అన్ని సౌకర్యాలు సమకూర్చామన్నారు. క్రిటికల్ పోలింగ్ స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు.
ఎన్నికల పటిష్ట నిర్వహణలో భాగంగా సైబరాబాద్ లోని 38 డివిజన్ లకు గాను దాదాపుగా 13,500 మంది (10,500 మంది సివిల్ పోలీసులు, 3000 మంది ఏఆర్) పోలీస్ సిబ్బంది విధులు నిర్వహించనున్నారన్నారు.

నిష్ప‌క్ష‌పాతంగా పోలీసులు ప‌నిచేయాలి

వీరితో పాటు పెద్ద ఎత్తున డీసీపీలు, ఏడీసీపీలు, ఏసీపీలు, ఇన్ స్పెక్టర్లు ఎన్నికల విధులలో పాల్గొంటున్నారన్నారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. ఎన్నికల వేళ పోలీసులు విధుల్లో నిర్లక్ష్యం వహించరాదన్నారు. నిష్పక్షపాతంగా పని చేయాలన్నారు.

Related posts

పుణ్య క్షేత్రం శ్రీ మైసమ్మ దేవత ఆలయం మూసివేత

Satyam NEWS

టీఆర్ఎస్ 21వ వార్షికోత్సవ సందర్భంగా హుజూర్ నగర్ లో జెండా పండుగ

Satyam NEWS

కలెక్టరెట్ లో సోలార్ షెడ్ ప్రారంభం

Bhavani

Leave a Comment