40.2 C
Hyderabad
May 5, 2024 17: 01 PM
Slider నల్గొండ

టీఆర్ఎస్ 21వ వార్షికోత్సవ సందర్భంగా హుజూర్ నగర్ లో జెండా పండుగ

#trsflag

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ మఠంపల్లి మండల కేంద్రంలో గురువారం తెలంగాణ 21వ, వార్షికోత్సవ సందర్భంగా మఠంపల్లి మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై ఉన్న తెలుగు తల్లి,అమరవీరుడు శ్రీకాంత్ చారి విగ్రహాలకు పూల మాలలు వేసి జెండా ఆవిష్కరణ సర్పంచ్,ఉత్తమ సర్పంచ్ అవార్డు గ్రహీత మన్నెం శ్రీనివాసరెడ్డి టిఆర్ఎస్ పార్టీ జెండాను ఘనంగా ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ దేశానికే తెలంగాణ రాష్ట్రం రోల్ మోడల్ గా గుర్తింపు పొందిందని అన్నారు. మఠంపల్లి గ్రామ శాఖ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పిండిప్రోలు రామచంద్రయ్య మాట్లాడుతూ ప్రాణాలను సైతం లెక్క చేయక దశాబ్దాలుగా పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పాలనలో రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేయాలనే సంకల్పంతో ఏ రాష్ట్రంలో లేనన్ని క్రొత్త సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు.

రైతు బంధు,రైతు భీమా,మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ,కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్,ఆసరా పెన్షన్ లు,వికలాంగుల పెన్షన్ లు, కెసిఆర్ కిట్,డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, దళిత బందు,గొర్రెల పెంపకం, పల్లె ప్రకృతి వనాలు వంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు అందిస్తున్న ఘనత కెసిఆర్ కే దక్కుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపిటిసి సైదమ్మ, ఉప సర్పంచ్ జాలా కిరణ్ యాదవ్, వల్లపుదాసు బాలకృష్ణ,సురేష్, మన్నెం శేశిరెడ్డి,గాయం రామానుజ రెడ్డి, రావూరి కల్పన,పోతబత్తిని శ్రీనివాస్, వస్కుల జయరాజు,తవిడబోయిన వెంకటయ్య,చింతల నరసింహారావు, చల్లా వీరబాబు నాగరాజు,మట్టపల్లి సర్పంచ్ దాసరి విజయలక్ష్మి,కోలాహలం లక్ష్మీనరసింహ రాజు,సయ్యద్ బిబీ కుతుబ్,పఠాన్ జాన్ బి,ఆయా గ్రామాల్లో సర్పంచ్ లు టిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

బ్లెసింగ్ గాస్పెల్ మిసిస్ట్రీస్ చర్చి ప్రారంభం

Satyam NEWS

భూ నిర్వాసితుల గోడు పట్టించుకోని టిఆర్ఎస్ నేతలు

Satyam NEWS

31 న వ‌ర్చువ‌ల్ విధానంలో విజయనగరం వైద్య క‌ళాశాల శంకుస్థాప‌న‌

Satyam NEWS

Leave a Comment