27.7 C
Hyderabad
May 4, 2024 09: 14 AM
Slider నల్గొండ

వలస కార్మికులను ఆదుకోవడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం

#Comunist Party of India

వలస కార్మికులు ఆదుకోవటంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ సిపిఐ పార్టీ నిరసన ప్రదర్శన నిర్వహించింది. నల్లబ్యాడ్జీలు ధరించి స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం నిర్వహించిన అనంతరం తహసిల్దార్ కు వినతి పత్రం సమర్పించారు.

వలస కార్మికులను ఆదుకోవడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని ఈ సందర్భంగా వక్తలు విమర్శించారు. లాక్ డౌన్ ఆకస్మికంగా ప్రకటించడంతో అనేక మంది వలస కార్మికులు పనులు లేక ఆకలితో అలమటించారని, తట్టుకోలేక తమ సొంత గ్రామాలకు వెళ్లాలని కిలోమీటర్ల దూరం నడిచి ఎన్నో అవస్థలు పడ్డారు అని వారన్నారు.

నేటికీ పడుతున్నారని అందులో చిన్న పిల్లలు కూడా ఉన్నారని, ఎర్రటి ఎండలో కాళ్లకు గుడ్డలు కట్టుకొని నడిచి వెళ్లిన సంఘటనలు కూడా ఉన్నాయని నిరసన కారులు అన్నారు. ప్రభుత్వం వన్ నిర్మాణ క్షయం కారణంగా అనేక పొరపాట్లు జరిగాయని అన్నారు. వలస కార్మికులకు ప్రయాణ ఖర్చులు నిమిత్తం పదివేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు పాలకూరి బాబు, రాములు,రమేష్ ,గుండు వెంకటేశ్వర్లు, కంబాల శ్రీనివాస్,సోమగాని కృష్ణ, జక్కుల శ్రీనివాస్,మోహనరావు,ఇందిరా వెంకటేశ్వర్లు,గుండెబోయిన వెంకన్న, రామనరసయ్య, నరసింహ తదితరులు పాల్గొన్నారు.

Related posts

తెలుగుదేశం శ్రేణులపై పోలీసుల దౌర్జన్యం: డాక్టర్ చదలవాడ అరెస్టు

Satyam NEWS

మహిళా దినోత్సవం నాడు వంద ఆరోగ్య మహిళ కేంద్రాలు

Murali Krishna

మరో రెండు నోటిఫికేషన్లు

Murali Krishna

Leave a Comment