38.2 C
Hyderabad
May 5, 2024 19: 31 PM
Slider ఆంధ్రప్రదేశ్

ఏపీలో 16 మంది ఐఏఎస్‌ అధికారుల బదిలీ

#Amaravathi

పలువురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ఏపి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వారి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బీసీ వెల్ఫేర్ స్పెషల్ సీఎస్‌గా కె. ప్రవీణ్ కుమార్ నియమితులయ్యారు. రజత్ భార్గవ్‌కు అదనంగా పర్యాటకం, సాంస్కృతిక శాఖలు కేటాయించారు.

క్రీడలు, యువజనసంక్షేమం ప్రిన్సిపల్ సెక్రటరీగా కె. రామ్‌గోపాల్ నియమితులయ్యారు. ఎస్టీ వెల్ఫేర్ గిరిజనసంక్షేమం సెక్రటరీగా కాంతిలాల్ దండే నియమితులయ్యారు. సర్వే, లాండ్ సెటిల్‌మెంట్స్ డైరెక్టర్‌గా సిద్ధార్థజైన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. మత్స్యశాఖ కమిషనర్‌గా కన్నబాబుకు అదనపు బాధ్యతలు అప్పగించారు.

ఎస్సీ కార్పొరేషన్ ఎండీగా జి.శ్రీనివాసులు ను నియమించారు. అనంతపురం జేసీ(అభివృద్ధి)గా ఎ.సిరి, సివిల్‌ సప్లైస్ డైరెక్టర్‌గా దిల్లీరావు నియమితులయ్యారు. శాప్ ఎండీగా వి.రామారావుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. దేవాదాయశాఖ స్పెషల్ కమిషనర్‌గా పి.అర్జున్‌రావు, సీతంపేట ఐటీడీఏ ఈవోగా చామకూరి శ్రీధర్, నెల్లూరు మున్సిపల్ కమిషనర్‌గా స్వప్నిల్ దినకర్, కాకినాడ మున్సిపల్ కమిషనర్‌గా సునీల్‌కుమార్‌రెడ్డి నియమితులయ్యారు.

ఫైబర్ నెట్ ఎండీ గా ఎం. మధు సూదన్‌ రెడ్డి, ఏపీ ఎండీసీ ఎండీ(ఇంచార్జ్)గా వీజీ వెంకట్‌రెడ్డి నియమితులయ్యారు.

Related posts

సమన్వయంతో పని చేసి ఎస్ సి, ఎస్ టి కేసులు పరిష్కరించండి

Satyam NEWS

కరోనాతో శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకుడు మృతి

Satyam NEWS

రాహుల్ ‘జోడో’ యాత్ర రాజస్థాన్ రేఖ మార్చేనా?

Bhavani

Leave a Comment