29.7 C
Hyderabad
May 4, 2024 04: 53 AM
Slider హైదరాబాద్

హానికరమైన బీజేపీ, బిఆర్ఎస్, ఎంఐఎం పార్టీలను ఓడించండి

#vijayareddy

దేశానికి, రాష్ట్రానికి హానికరమైన బీజేపీ, బిఆర్ఎస్, ఎంఐఎం పార్టీలను ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించాలని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఈ.టి. నరసింహ పిలుపునిచ్చారు. హైదరాబాద్, హిమాయత్ నగర్, మఖ్డూమ్ భవన్ లో మంగళవారం ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి. విజయ రెడ్డి కు మద్దతుగా సిపిఐ హైదరాబాద్ జిల్లా సమితి ఏర్పాటుచేసిన ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ముఖ్య కార్యకర్తల సమావేశం సిపిఐ హైదరాబాద్ జిల్లా సహాయ కార్యదర్శి కమతం యాదగిరి అధ్యక్షతన జరిగింది.

ఈ సమావేశంలో ఈ.టి. నరసింహ తోపాటు పి. విజయ రెడ్డి, మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్ర కుమార్, ప్రముఖ సంఘసంస్కర్త మోటూరి కృష్ణ ప్రసాద్, సిపిఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఎస్. ఛాయాదేవి, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి బి. వెంకటేశం ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం కార్యదర్శి మామిడిచెట్ల వెంకట్ స్వామి, ఏఐటీయూసీ నగర ఉపాధ్యక్షులు ఏ. బిక్షపతి యాదవ్, ఏఐటీయూసీ నాయకులూ నరసింహ తదితరులు వేదికపై ఆసీనులైనారు. ఈ సమావేశంలో ఈ.టి. నరసింహ మాట్లాడుతూ దేశ సంపదను అక్రమంగా అమ్ముకుంటూ దేశాన్ని దోచుకుంటున్న మోడీ, ప్రతి ప్రాజెక్టు పనులలో కమిషన్లు దండుకొని అందిన కాడికి దోచుకుంటున్న కెసిఆర్, ఈ ఇద్దరు తోడుదొంగలకు తోక దొంగగా ఒవైసి మారాడని ఆరోపించారు. ఆరోగ్యం, విద్య, ఉపాధి మరియు ఆహార భద్రత వంటి రంగాలలో సమాజంలోని అణగారిన వర్గాల హక్కులు దెబ్బతీస్తున్న బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలను తరిమికొట్టాలని అయన కోరారు.

ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్, సిపిఐ కలసి పోటీ చేస్తున్నాయని, అందులో భాగంగా ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి. విజయ రెడ్డి సిపిఐ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని, సిపిఐ నాయకులూ కార్యకర్తలు పి. విజయ రెడ్డి గెలుపు కోసం కృషి చేయాలనీ ఈ.టి. నరసింహ విజ్ఞప్తి చేసారు. జస్టిస్ చంద్ర కుమార్ మాట్లాడుతూ ప్రాణత్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న ప్రజల ఆకాంక్షలను సీఎం కెసిఆర్ కాలరాశాడని మండిపడ్డారు. నిరంకుశ కుటుంబ పాలనా కొనసాగిస్తూ నియామకాలు చేపట్టాక, నీళ్లు, నిధులు అందించక గత పదిసంవత్సరాలలో తెలంగాణ ప్రజలను నిలువునా బిఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు.

ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ ఓటు వేయకుండా తగిన బుద్ధి చెప్పాలని కోరారు. పి. విజయ రెడ్డి మాట్లాడుతూ గత పది సంవత్సరాలనుండి ఎమ్యెల్యే దానం నాగేందర్ ఎమ్యెల్యే అనే విషయం కేవలం హోదా కోసమే వాడుకున్నాడని, ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రజా సమస్యలు తెలుసుకోవడం, పరిష్కరించడంలో దానం నాగేందర్ ఫుర్తిగా విఫలమైయ్యాడని ఆరోపించారు. నియోజకవర్గం అభివృద్ధికి మార్పు అవసరమన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తాను ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ప్రజలతో మమేకమై, పిజెఆర్ స్పూర్తితో ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పిస్తానని, నియోజకవర్గం అభివృద్ధికి తోడ్పడి అందరికి ఆదర్శనంగా నిలుస్తానని ఆమె హామీ ఇచ్చారు.

తన విజయం కోసం సిపిఐ మద్దతు తెలపడం అభినందనీయం అని, నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలు తమ ఓటు కాంగ్రెస్ పార్టీకు వేసి తనను గెలిపించాలని పి. విజయ రెడ్డి విజ్ఞప్తి చేసారు. ఈ సమావేశంలో సిపిఐ హైదరాబాద్ జిల్లా కార్యవర్గ సభ్యులు నిర్లేకంటి శ్రీకాంత్, నాయకులూ బాలకృష్ణ, చైతన్య యాదవ్, సిహెచ్. జంగయ్య తదితరులు పాల్గొన్నారు.

Related posts

కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో కలిసి కాంగ్రెస్ బిసి డిక్లరేషన్

Satyam NEWS

ఏపిలో మ‌రో 13 మంది ఐపీఎస్ లు బ‌దిలీ…!

Satyam NEWS

క్యాబినెట్ డెసిషన్: ఈనెల 24 నుంచి పట్టణ ప్రగతి

Satyam NEWS

Leave a Comment