27.7 C
Hyderabad
May 14, 2024 03: 56 AM
Slider ఆదిలాబాద్

డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం ఆదిలాబాద్ లో సిపిఐ ధర్నా

#cpi

అర్హులైన నిరుపేదలందరికి డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ధర్నా నిర్వహించింది. నేడు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేసిన అనంతరం జిల్లా కలెక్టర్ కి మెమోరాండం ఇచ్చారు. అర్హులైన అందరికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు లేదా ఇంటి స్థలం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.

నిరుపేదలకు ఇంటి స్థలం ఇవ్వాలని, సొంత ఇంటి స్థలాలు ఉన్నవారికి ఇల్లు నిర్మించుకోడానికి రూ.లు 5.లక్షలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. కండ్లకు నల్ల బ్యాడ్జీలు కట్టుకొని నిరసన ధర్నా చేసిన తర్వాత సిపిఐ నాయకుడు ముడుపు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ గత 56 రోజుల నుండి సాధన కమిటీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేసినా అధికారులకు, జిల్లా ప్రజాప్రతినిధులకు కనిపించడం లేదని అన్నారు.

తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ ప్రజలందరు బాగుపడతారని  నీళ్లు నిధులు నియామకాలు వస్తాయని ఆశపడ్డారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే ప్రతి ఒక్కరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తానని మోసపూరిత మాటలు చెప్పిన కేసీఆర్ పాలన 8 ఏళ్లు గడిచినా పేదలకు ఏం జరగలేదని ఆయన అన్నారు.

ఆదిలాబాద్ పట్టణంలో 49 వార్డులో ఇండ్లు లేక ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లేదా 25×25 Sft ఇంటి స్థలాలైన ఇవ్వాలి మరియు సొంత ఇంటి స్థలాలు ఉన్నవారికి ఇల్లు నిర్మించుకోడాని రూ.లు 5.లక్షలు వెంటనే ఇవ్వాలి అలాగే ప్రభుత్వ భూములలో ఇంటి స్థలాలు అపుకున్న నిరుపేదలందరి పట్టాలు వెంటనే ఇవ్వాలి. లేని పక్షంలో  పెద్ద ఎత్తున ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సాధన కమిటీ కో-కన్వీనర్లు మెస్రం భాస్కర్, AISF జిల్లా ఉపాధ్యక్షుడు మాడవి గణేష్, పుష్ప, లక్ష్మీ, దేవేందర్, కమల, రూబినా, పతిమ, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

కొత్త వారికి పెన్షన్లు మంజూరు చేయడం మరచిపోయిన ప్రభుత్వం

Satyam NEWS

కక్షపూరితంగానే ఎమ్మెల్యే టికెట్ రాకుండా చేశారు

Bhavani

డామిట్: ప్రముఖులను ప్రమాదంలోకి నెట్టిన కనికా కపూర్

Satyam NEWS

Leave a Comment