31.7 C
Hyderabad
May 7, 2024 01: 45 AM
Slider జాతీయం

డామిట్: ప్రముఖులను ప్రమాదంలోకి నెట్టిన కనికా కపూర్

kanika kapoor

అన్నీ తెలిసిన విద్యావంతులే జాగ్రత్తలు తీసుకోకపోవడం దేశ ప్రజలకు శాపంగా మారింది. అలాంటి వారి వల్లే కరోనా వైరస్ దేశంలో ఇంతలా విస్తరిస్తున్నది. బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ తన ట్రావెల్ ప్లాన్  చెప్పకుండా విదేశాల నుంచి రాగానే దేశంలోని ప్రముఖులను కలవడం ఇప్పుడు అతి పెద్ద ప్రమాదంగా పరిణమించింది.

కరోనా సోకిన బాలీవుడ్ సింగర్ ఆ విషయం గ్రహించకుండా బీజేపీ ఎంపీ దుష్యంత్ సింగ్ ను కలిశారు. ఆయన వెళ్లి రాష్ట్రపతిని కలిశారు. కనికా కపూర్ కి కరోనా పాజిటివ్ అని రావడంతో ఇప్పుడు అంతా షాక్ అయ్యారు. దీంతో రాష్ట్రపతి రామ్ నాథ్ అలర్ట్ అయ్యారు. తన కార్యక్రమాలన్నీ రద్దు చేసుకున్నారు.

ఆయన కరోనా పరీక్షలు చేయించుకునే అవకాశం ఉందని, స్వీయ నిర్బంధం(సెల్ఫ్ క్వారంటైన్) కానున్నారని తెలుస్తోంది. కనికా కపూర్ వ్యవహారంపై యూపీ ప్రభుత్వం సీరియస్ గా ఉంది. కనికా కపూర్ మార్చి 15న యూకే నుంచి వచ్చింది. ఆ తర్వాత లక్నోలోని ఫైవ్ స్టార్ హోటల్ లో ప్రముఖులకు విందు ఇచ్చింది.

విదేశాల నుంచి వచ్చిన వారు ఎవరైనా వెంటనే 14 రోజుల పాటు సెల్ఫ్ క్వారంటైన్ కావాలని కేంద్రం ఆదేశించింది. విదేశీ ప్రయాణ వివరాలను ప్రభుత్వానికి అందించాలి. ఇది తప్పనిసరి. అయితే కనికా కపూర్ మాత్రం రూల్స్ బ్రేక్ చేసింది. విదేశీ ప్రయాణ వివరాలు దాచిపెట్టడమే కాకుండా, సెల్ఫ్ క్వారంటైన్(స్వీయ నిర్భంధం) కూడా కాలేదు.

దీన్ని యూపీ సర్కార్ సీరియస్ గా తీసుకుంది. ఆమెపై చర్యలు తీసుకుంటామని చెప్పింది. అలాగే కనికా కపూర్ ఇచ్చిన పార్టీకి హాజరైన వారి వివరాలను, కనికాను కలిసిన వారి వివరాలను ప్రభుత్వం సేకరిస్తోంది. కనికాకు కరోనా అని తేలడంతో ఆమెను కలిసిన వారిలో ఆందోళన వ్యక్తమవుతోంది.

తన పార్టీకి హాజరైన ప్రముఖులతో కనికా సెల్ఫీలు తీసుకున్నారు. షేక్ హ్యాండ్ లు ఇచ్చారు. ఆ పార్టీకి హాజరైన మరుసటి రోజు ఎంపీ దుష్యంత్ సింగ్ పార్లమెంటు సెంట్రల్‌ హాల్ లో ఎంపీ నిశికాంత్, మనోజ్ తివారీతో భేటీ అయ్యారు. ఆ తర్వాత పార్లమెంటుకు వెళ్లారు. ఆ తర్వాత రాష్ట్రపతిని కూడా కలిశారు.

కనికాకు పాజిటివ్ అని తేలడంతో ఎంపీ దుష్యంత్ సింగ్, ఆయన తల్లి వసుంధరా రాజే ముందు జాగ్రత్తగా సెల్ఫ్ క్వారంటైన్(స్వీయ నిర్బంధం)లోకి వెళ్లిపోయారు. సింగర్‌ కు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆరోగ్య శాఖ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. కనికా ఇచ్చిన పార్టీకి హాజరైన వారందరూ స్వయంగా క్వారంటైన్‌లోకి వెళ్లిపోవాలని, ఏవైనా కరోనా లక్షణాలుంటే వెంటనే తమకు తెలియజేయాలని సూచించారు.

Related posts

డేంజర్ బెల్స్: ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా

Satyam NEWS

కువైట్ లో కరోనా తో కడప జిల్లా వాసి మృతి

Satyam NEWS

జింబాబ్వే పై టీమిండియా ఘన విజయం

Satyam NEWS

Leave a Comment