38.2 C
Hyderabad
May 5, 2024 19: 35 PM
Slider మెదక్

గుడిసెలు తగలబె ట్టిన వారిని వెంటనే శిక్షించాలి: సీపీఎం డిమాండ్

#Dubbaka

సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలోని మారెమ్మ టెంపుల్ పరిధిలో పిట్టల వారి గుడిసెను తగులబెట్టడం దుర్మార్గమని సిపిఎం నేతలు అన్నారు. తగులబడిన పిట్టల వారి గుడిసెలను సిపిఎం పార్టీ నాయకులు నేడు సందర్శించారు.

అనంతరం సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు జి భాస్కర్ మాట్లాడుతూ పిట్టల వారీ గుడిసెలను వారం రోజుల్లో రెండవ సారి మరో కుటుంబానికి చెందిన కాలియా స్వామి గుడిసెను తగులబెట్టడం దుర్మార్గమైన చర్య అన్నారు.

గుడిసెలు వేసుకొని  గత కొన్ని సంవత్సరాలుగా నివాసం ఉంటున్నారని ప్రకృతి పరంగా వచ్చే పండ్లను సేకరించుకుని జీవనోపాధి కొనసాగిస్తున్నారని తెలిపారు.

గత రాత్రి సుమారు రెండు గంటల ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి తగల పెట్టడం జరిగిందని అలాంటి వారిని వెంటనే  శిక్షించాలని డిమాండ్ చేశారు. పిట్టల వారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు.

గుడిసె కాలిపివడం వలన వారి కుటుంబానికి వేల రూపాయల నష్టం జరిగిందని ఆ కుటుంబాలను వెంటనే ప్రభుత్వం ఆదుకొవాలని  ప్రభుత్వానికి కోరారు.

ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఇంతవరకు ఇవ్వకపోవడం తో పాటు పిట్టల వారు గుడిసెలు వేసుకుని జీవనం కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

గుడిసెలోకి రోజు పాములు,తేళ్లు రావడంతో ప్రాణభయం కూడా రోజురోజుకు నెలకొంటుందని ఇలాంటి పరిస్థితుల వల్ల కుటుంబాలను వెంటనే ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలోకి పంపించాలని వారి కుటుంబాలను ఆదుకొని జీవనోపాధి కోసం కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పెంటి సాయికుమార్,బత్తుల రాజు, కొంపల్లి భాస్కర్ మరియు పిట్టల వారు జయరామ్,చలపతి, చెన్నయ్య,లత, ప్రేమల, లక్ష్మి, పద్మ, తదితరులు పాల్గొన్నారు.

Related posts

నడక…నడక…

Satyam NEWS

బద్వేల్ ఉప ఎన్నికల్లో నేను పోటీ చెయ్యడం లేదు

Satyam NEWS

గార్మి పండుగ వేడుకల్లో పాల్గొన్న మంత్రి సింగిరెడ్డి

Satyam NEWS

Leave a Comment