41.2 C
Hyderabad
May 4, 2024 15: 40 PM
Slider నల్గొండ

పేదలకు ఇచ్చిన పట్టాలను పంచాలి

#CPMProtest

నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజక వర్గం చిట్యాల మండలం నేరడ గ్రామంలో పేదల ఇండ్లస్థలాలకోసం కొనుగోలు చేసి పట్టాలు ఇచ్చిన భూమిని పంచాలని సిపియం పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. 

ఈ సందర్భంగా పార్టీ మండల కార్యదర్శి అవిశెట్టి శంకరయ్య మాట్లాడుతూ  నేరడ గ్రామంలో  పేదలకు  నివాస గృహాలు నిర్మించి ఇవ్వడానికి 25 సంవత్సరాల క్రితం అప్పటి  శాసనసభ్యుడు  నంద్యాల నర్సింహారెడ్డి తమనిదులనుండి ఖర్చు పెట్టి  సర్వే నెంబర్ 290లో 13ఎకరాల14గుంటల భూమి ని కొనుగోలు చేసి 300 మందికి పైగా లబ్దిదారుల కు పట్టాలు ఇప్పించటం జరిగింది. కానీ ఆప్రాంతంలో పేదలు నివసించటానికి కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించకపోవటంతో పేదలు తమ నివాసాలను ఏర్పాటు చేసుకోలేకపోయారు.

ఇప్పటికైనా అధికారులు స్పందించి నిజమైన లబ్దిదారుల ను గుర్తించి గతంలో ప్రభుత్వం ఇండ్ల స్థలాల కోసం కొనుగోలు చేసిన భూమి ని పంపిణీ చేసి ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

అనంతరం తహశీల్దార్ కు వినతిపత్రం అందజేశారు  ఈ కార్యక్రమంలో సిపియం పార్టీ మండల కమిటీ సభ్యులు  ఐతరాజు నర్సింహ్మ ,శాఖా కార్యదర్శి మందుగుల యాదయ్య, కందగట్ల గణేష్, కల్లూరి లక్ష్మయ్య, వడ్డెపల్లి యల్లయ్య  , పోలోజు ఈశ్వరాచారి, కల్లూరి శత్రయ్య, ఐతరాజు అంజయ్య, యాదయ్య, సత్తయ్య,బిక్షం, జయమ్మ,  మల్లమ్మ, ఐతరాజు  అనిల్, స్వామి, మెండె మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.

Related posts

నట రత్నాలు’ ఆడియో ఫంక్షన్‌లో సుమన్‌పై శివనాగు ఫైర్‌!

Bhavani

ఇ ఎస్ ఐ సి ఆసుపత్రి సిబ్బందికి వేధింపుల కరోనా

Satyam NEWS

కబ్జా చేసుకున్న భూమి నుంచి వెళ్లిపొమ్మంటే సర్పంచ్ కుటుంబం హల్ చల్

Satyam NEWS

Leave a Comment