39.2 C
Hyderabad
May 3, 2024 11: 06 AM
Slider కడప

కబ్జా చేసుకున్న భూమి నుంచి వెళ్లిపొమ్మంటే సర్పంచ్ కుటుంబం హల్ చల్

#land

అన్నమయ్య జిల్లా రాజంపేట మండలంలోని వరదయ్య గారి పల్లి సర్పంచ్ శ్రీహరి కుటుంబం శనివారం నాడు తమ ఆధీనంలో ను భూ కబ్జాలను తొలగిస్తే ఆత్మహత్య చేసుకుంటామని హాల్ చల్ చేశారు. పుల్లంపేట మండలంలో తిప్పాయపల్లి పొలం సర్వే నెంబర్ 619 పట్టా స్థలంలో తో పాటూ 9 ఎకరాల ప్రభుత్వ భూమిని సర్పంచ్ కుటుంబం కబ్జాచేసి మామిడి మొక్కలు నాటి సాగు చేసు కుంటున్నారు. ఇందులోని ప్రభుత్వ భూమిని అసైన్ మెంట్ కమిటీలో దళితులకు ఇవ్వాలని అధికారులు ప్రతిపాదించి ఉన్నారు.

దాని స్వాధీనం కోసం  రెవెన్యూ అధికారుల యత్నం చేయగా,సర్పంచ్ కుటుంబ సభ్యులు ప్రతిఘటించారు. పెట్రోల్ పోసుకొని నిప్పు పెట్టుకుంటామని సర్పంచ్ కుటుంబం హైడ్రామా సృష్టించారు. ఈ సందర్భంగా పెట్రోల్ అక్కడికి చేరుకున్న వంటిపై కంట్లో పడింది. వరుసగా అన్ని ఆక్రమణలు తొలగించి తమ స్థలంలో తొలగించాలని రెవెన్యూ అధికారులను బెదిరించారు. సంఘటనా స్థలానికి చేరుకొన్న  పోలీసులు పరిస్థితి ని అదుపులోకి తెచ్చి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన ను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు పోయినట్టు తాసీల్ధార్ నరసింహా కుమార్ తెలిపారు. సర్పంచి పట్ల రెవెన్యూ సిబ్బంది, పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని సర్పంచ్ ఆక్రమిత భూములే కాకుండా ముందు ఇతరులు ఆక్రమించిన భూములను స్వాధీనం చేసుకోవాలని జిల్లా సర్పంచుల సంఘం సంయుక్త కార్యదర్శి జంబు సూర్యనారాయణ డిమాండ్ చేశారు.

Related posts

ఉచిత న్యాయ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

Satyam NEWS

అంతర్జాతీయ ర్యాపిడ్ రేటింగ్ టోర్నమెంట్ లో విక్టరి విద్యార్థుల ప్రతిభ

Satyam NEWS

డీప్ ట్రబుల్: పెరుగుతున్నఅమెరికా ఇరాన్ ల మధ్య ఉద్రిక్తతలు

Satyam NEWS

Leave a Comment