41.2 C
Hyderabad
May 4, 2024 17: 19 PM
Slider విజయనగరం

కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీతో రుణ సౌకర్యం

#creditsociety

పోలీసు ఉద్యోగులు, హెూంగార్డుల అభివృద్ధి, సంక్షేమంలో భాగంగా వారి ఆర్ధిక అవసరాలను తీర్చుకొనేందుకు తక్కువ వడ్డీకే రుణ సౌకర్యం కల్పిస్తున్నామన్నామని విజయనగరం జిల్లా ఎస్పీ దీపికా తెలిపారు. ఈ మేరకు డీపీఓలో శాఖ పరంగా సిబ్బందికి అమలవుతున్న  కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సర్వ సభ్య సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ దీపికా మాట్లాడుతూ అదే విధంగా సొసైటీ లాభాలను అందరికి వర్తించే విధంగా చేయడంతోపాటు, ప్రతీ సంవత్సరం పురోగభివృద్ధి సాధిస్తుందన్నారు. ఇందులో వచ్చిన లాభాల నుండి సొసైటీ సభ్యుల పిల్లలను చదువులో ప్రోత్సహించేందుకు ప్రతీ సంవత్సరం స్కాలర్‌షిప్ లను కూడా అందిస్తున్నామన్నారు. పోలీసు ఉద్యోగులకు మరింత లబ్ధి చేకూర్చడంలో భాగంగా సభ్యుల అంగీకారంతో వ్యక్తిగత రుణాల మంజూరు పరిమితిని మరింతగా పెంచి, వాటిపై వడ్డీ రేటును కూడా 6శాతం నుండి 4.8శాతంకు (రూ. 0.50 పైసల నుండి రూ.0.40 పైసలకు) తగ్గించామన్నారు. సభ్యుల పిల్లల వివాహాలకు ప్రత్యేకంగా 7లక్షల రుణ సౌకర్యం కల్పించేందుకు నిర్ణయించామని జిల్లా ఎస్పీ ఎం.దీపిక తెలిపారు. పోలీసు ఉద్యోగుల సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్న జిల్లా ఎస్పీ కృషిని పలువురు పోలీసు ఉద్యోగులు, పోలీసు అధికారుల సంఘం కొనియాడారు.

టెన్త్, ఇంటర్ పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన పోలీసు ఉద్యోగుల కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సభ్యుల పిల్లలకు జిల్లా ఎస్పీ ఎం.దీపిక 41,500/-ల నగదును స్కాలర్షిప్ లుగా అందజేసారు. ఈ సందర్భంగా పోలీసు ఉద్యోగుల పిల్లలతో జిల్లా ఎస్పీ మమేకమై, మంచి లక్ష్యాలను నిర్దేశించుకొని, జీవితంలో ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. అంతేకాకుండా, 10వ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో వారు సాధించిన మార్కులు, ప్రస్తుతం వారు ఎక్కడ చదువుతున్నది వంటి విషయాలను తెలుసుకొని, వారికి తగిన సూచనలు, సలహాలను ఇచ్చి, స్ఫూర్తి నింపారు.

కొద్దిమంది పిల్లలు ఐ.ఐ.టి.ల్లో సీట్లు సాధించం, దేశ వ్యాప్తంగా వివిధ ఐఐటిల్లో ఉన్నత విద్యాభ్యాసం చేయడం గర్వంగా ఉందని జిల్లా ఎస్పీ ఎం. దీపిక అన్నారు. ఈ కార్యక్రమంలో ఎఆర్ అదనపు ఎస్పీ ఎం.ఎం. సోల్మన్, ఎఆర్ డిఎస్పీ ఎల్.శేషాద్రి, ఎస్బీ సిఐ రుద్రశేఖర్, ఆర్డీలు బి.రమణమూర్తి, టివిఆర్కే కుమార్, సొసైటీ సెక్రటరీ నీలకంఠం నాయుడు, పోలీసు అధికారుల సంఘం అడహక్ అధ్యక్షులు కే. శ్రీనివాసరావు, డైరెక్టర్లు రామకృష్ణ, ఈశ్వరరావు, రమణారావు, చిన్నారావు, విజయచందర్, హెూంగార్డ్సు సొసైటీ సెక్రటరీ సుశీల మరియు డైరెక్టర్లు పాల్గొన్నారు.

Related posts

సంగారెడ్డి జిల్లా ల్యాండ్ పార్సెల్స్ కు మంచి ఆదరణ

Bhavani

హీరోయిన్ సునైన ఫొటో గ్యాలరీ

Satyam NEWS

ఆస్కార్ ఎంట్రీ జాబితాలో డియర్ కామ్రేడ్

Satyam NEWS

Leave a Comment