28.7 C
Hyderabad
May 6, 2024 03: 02 AM
Slider ముఖ్యంశాలు

మంత్రి బొత్స సత్యనారాయణ తాచుపాము

#potulabalakotaiah

వైసీపీ సోషల్ మీడియాలో అమరావతి దళిత ఉద్యమకారులను టార్గెట్ చేసి వ్యక్తిత్వ హననం కి పాల్పడుతున్నారని అమరావతి బహుజన జెఎసి అధ్యక్షులు పోతుల బాలకోటయ్య అన్నారు. దీనితో బాటు అమరావతి రైతుల మహా పాదయాత్రను అడ్డుకునేందుకు వాట్స్ యాప్ మెసేజీలను పెద్ద ఎత్తున సర్క్యులేట్ చేస్తున్నారని ఆయన అన్నారు. రాజధాని రైతులను పిల్లపాములని, వారివి త్యాగాలే కావని మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై అమరావతి  బహుజన జెఎసి అధ్యక్షులు పోతుల బాలకోటయ్య  మండిపడ్డారు.

అతిపెద్ద త్రాచుపాము లాంటి మంత్రి బొత్స సత్యనారాయణ నీడలో ఉత్తరాంధ్ర ఇంతకాలం అభివృద్ధికి నోచుకోలేదని ఆయన అన్నారు. నాటి ఉమ్మడి ఏపీ విభజన పర్వంలో బొత్స నాటకాలను ఉత్తరాంధ్ర ప్రజలు గుర్తుకు తెచ్చు కోవాలన్నారు. మాజీ సీఎం రోశయ్య పదవి దిగగానే సీఎం పదవి కోసం కాళ్లకు చెప్పులు లేకుండా ఢిల్లీ చుట్టూ చేసిన ప్రదక్షిణలను ఏపీ ప్రజలు మర్చిపోరు అన్నారు. మూడున్నరేళ్ళుగా వైకాపా ప్రభుత్వం చేస్తున్న పరిపాలన రాజధాని రైతులు ఇచ్చిన భూములలోనే అని గుర్తు చేశారు.

ఉత్తరాంధ్ర కోసం కానీ, రాజధాని కోసం కానీ వైసీపీ నేతలు చేసిన త్యాగం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. దళిత బహుజన కులాలకు చెందిన నాయకుల జోలికొస్తే,  సెక్షన్ 3 కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.  పాదయాత్రను అడ్డుకునేందుకు  మూడు రాజధానులకు అనుకూలంగా ప్లే కార్డ్స్ పట్టుకొని  రావాలని వాట్సాప్ మెసేజ్లు చేస్తున్నారని, తణుకులో వ్యాపారస్తులకు తెలియకుండా మూడు రాజధానులకు మద్దతుగా వారి సంఘాల పేర్లతో బ్యానర్లు కట్టారని, వ్యాపారులు ప్రశ్నిస్తే ప్రభుత్వ ఆదేశాలని సమాధానం చెబుతున్నారని చెప్పారు.  పాదయాత్రకు భయపడకపోతే, ఇలాంటి కుప్పి గంతులు, విద్వేషాలు రెచ్చగొట్టే పనులు దేనికని మంత్రిని బాల కోటయ్య ప్రశ్నించారు. రాష్ట్రంలో రగిలించిన మూడు రాజధానుల విభజన మంటలు అంతిమంగా మూడు రాష్ట్రాల దిశగా అడుగులు వేస్తోంది అని పేర్కొన్నారు.

Related posts

కేంద్ర నిర్ణయంతో గల్ఫ్ కార్మికులకు తీవ్ర నష్టం

Satyam NEWS

జగన్ ఇంటి భద్రతా సిబ్బందికి కరోనా పాజిటీవ్

Satyam NEWS

మోడీ ప్రభుత్వంపై కదంతొక్కుతున్న కాంగ్రెస్ శ్రేణులు

Satyam NEWS

Leave a Comment