39.2 C
Hyderabad
May 4, 2024 19: 51 PM
Slider నిజామాబాద్

డాక్టర్ విశారదన్ మహారాజ్ పాదయాత్ర నేటితో పూర్తి

#dalitshkti

స్వరాజ్యం అంటే మన రాజ్యమని మూడు కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మెజార్టీ ప్రజల రాజ్యమని  డీఎస్ పి (దళిత శక్తి ప్రోగ్రాం) అధినేత డాక్టర్ విశారదన్ మహరాజ్ పేర్కొన్నారు. శనివారం కామారెడ్డి జిల్లాలో నసురుల్లాబాదు మండలం లోని దుర్కి, అంకొల్ క్యాంప్, నెమ్లి ,నస్రుల్లాబాద్ గ్రామాలకు చేరుకున్న 10 వేల కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్ర సందర్భంగా  నస్రుల్లాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద విశారదన్ మహారాజు   నిర్వహించిన సభలో పాల్గొని మాట్లాడారు.

పేదోడికి కనీసం ఉండడానికి భూమి ఇల్లు లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మన రాజ్యం వస్తే నిరుపేదలందరికీ కోటి ఎకరాల భూమిని పంచుకోవచ్చని విద్య,వైద్యం, ఉపాధి,భూమి, ఇల్లును అందరికీ సమానంగా పంచవచ్చని అన్నారు. 90 శాతం ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలు అధికారంలోకి రావాల్సి ఉండగా 10 శాతం లేని అగ్రవర్ణ రెడ్డి, వెలమలే ఈ రాజ్యాన్ని పరిపాలించడం దారుణం అన్యాయమని  అందుకే ఇకనైనా బడుగు బలహీన వర్గాలు రాజ్యాధికారం దిశగా చైతన్యం కావడానికి 10 వేల కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్ర చేపట్టినట్లు గా పేర్కొన్నారు.

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నుంచి మార్చి 15 న ప్రారంభమైన 10 వేల కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్ర  500రోజుల పాటు 33జిల్లాల గుండా సాగి చివరకు హైదరాబాద్ లో 10లక్షలమంది సభతో ముగుస్తుందన్నారు. శనివారంతో కామారెడ్డి జిల్లా పాదయాత్ర పూర్తి అయినది  సోమవారం నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రం నుండి  ప్రారంభం అవుతుంది ఈ కార్యక్రమంలో  డిఎస్ పి రాష్ట్ర ప్రతినిధి లక్ష్మణ్, కృష్ణ నాయక్, జిల్లా అధ్యక్షులు అరవింద్, జిల్లా ఉపాధ్యక్షులు రాజు,  ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం గ్రామ అధ్యక్షులు ఉల్లెంగ రాములు మండల కమిటీ గౌరవ అధ్యక్షులు మామిడి భూమయ్య, ఉల్లెంగ సాయిలు ,బంగారు మైసయ్య,పెంటయ్య,  ప్రశాంత్, గైని మొగులయ్య పాల్గొన్నారు.

జి.లాలయ్య సత్యం   న్యూస్   జుక్కల్ నియోజకవర్గం

Related posts

రోడ్డు ప్రమాదంలో హోటల్ యజమాని మృతి

Satyam NEWS

ఖమ్మం అభివృద్ధికి యస్ డియఫ్ నిధులు

Murali Krishna

కరోనా కారణంగా వేములవాడ ఆలయం మూసివేత

Satyam NEWS

Leave a Comment