37.2 C
Hyderabad
May 2, 2024 12: 02 PM
Slider ఖమ్మం

ఖమ్మం అభివృద్ధికి యస్ డియఫ్ నిధులు

#khammam

ఖమ్మం జిల్లా సమగ్రాభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఅర్  ఇచ్చిన వాగ్ధానం మేరకు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. జిల్లా అభివృద్ధి కి నిధులు మంజూరు చేయాలని అనేక మార్లు ముఖ్యమంత్రి కేసీఅర్ దృష్టి కి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  తీసుకెళ్లారు.  అనేక ప్రభుత్వాలు వచ్చిన పాలకులు కేవలం రాజకీయ అవసరాలకు వాడుకున్నారే తప్ప జిల్లా అభివృద్ధికి ఏనాడూ నిధులు మంజూరు చేయలేకపోయారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  ఖమ్మం నగరాభివృద్ధి తరహాలో జిల్లాను చూడాలనే ఆకాంక్షతో జిల్లాకు నిధులు ఇవ్వాలని అనేక మార్లు కేసీఅర్ కి  వినతి పత్రాలు అందించారు. స్పందించిన కేసీఅర్  జిల్లాకు రూ.248 కోట్లు మంజూరు చేశారు. ఆయా నిధులకు సంబందించి జీవో  ను ఇచ్చే వరకు వెంటపడి మరీ వచ్చేలా చేశారు. జిల్లాలోని ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ కు రూ. 50 కోట్లు, అన్ని సత్తుపల్లి, వైరా, మధిర ఒక్కో మున్సిపాలిటీలకు రూ.30 కోట్లు చొప్పున మొత్తం రూ 90 కోట్లు, ప్రతి గ్రామ పంచాయతీకి రూ.10లక్షల చొప్పున 584 గ్రామ పంచాయతీలకు గాను రూ.58.40 కోట్లు, పెద్దతండా, ఎదులాపురం, కల్లూరు, తల్లాడ, నేలకొండపల్లి గ్రామ పంచాయతీలకు రూ.10 కోట్లు చొప్పున మొత్తం రూ.50 కొట్లు మొత్తం జిల్లాకు గాను రూ.248.40 కోట్ల నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది.

జనవరి 18వ తేదిన ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ప్రారంభోత్సవంకు విచ్చేసిన ముఖ్యమంత్రి కేసీఅర్  ఖమ్మం జిల్లా అభివృద్ధి కోసం చేసిన వాగ్దానంను నేడు ఆచరణలో చేసి చూపారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  అభ్యర్థన మేరకు ఆయా నిధులను ముఖ్యమంత్రి కేసీఅర్ గారు పరిగణనలోకి తీసుకుని కేసీఅర్  ప్రకటించారు. ఇచ్చిన వాగ్ధానం మేరకు ఆయా నిధులను నేడు గురువారం ఉత్తర్వులను వెలువడించింది. ఇందుకుగాను తక్షణమే తదుపరి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు ఇచ్చారు. అభివృధి నిధులు విడుదల పట్ల జిల్లా ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కి కృతజ్ఞతలు తెలిపారు.

Related posts

కాట్రగడ్డ ప్రసూన వైపు కార్యకర్తల మొగ్గు

Satyam NEWS

ప్రజాస్వామిక తెలంగాణ కోసం పోరాడాలి

Bhavani

క్షీర సాగర మధన సారం

Satyam NEWS

Leave a Comment