28.7 C
Hyderabad
May 5, 2024 23: 37 PM
Slider కవి ప్రపంచం

అవనికి ప్రతిరూపం

#Puli Jamuna New
kaviprapancham-5
satyam news kavi prapancham special

మాతృత్వపు మాధుర్యాన్ని తలచుకుంటూ

పురిటి నొప్పులను సైతం లెక్కచేయకుండా

ప్రసవవేదను పంటి బిగువున భరించి

మృత్యువు అంచుల దరి చేరినా

ఓర్పు సహనాలకు నిదర్శనమై నిలిచి

అంతులేని మమకారంతో బిడ్డకు జన్మనిచ్చి

మరోజన్మ నెత్తిన అనురాగ దేవత అమ్మ

ప్రేమామృతాన్ని  క్షీరంగా మలచి

అమ్మదనంలోని కమ్మదనాన్ని

చవి చూపించే అమృతమయి అమ్మ

ముద్దుమురిపాలతో మురిసిపోతూ           

అక్కున చేర్చుకుని ఆనందించాల్సిన అమ్మ

ఆటుపోటుల జీవన సమరంలో

అలుపెరుగని పోరాటం చేస్తోంది

పసిబిడ్డను నడుముకు కట్టుకుని

ఆత్మీయ స్పర్శనందించి అభయమిస్తూ

ఇటుక ఇటుకను నెత్తిన పేర్చి పెట్టుకుని

బతుకు బాధ్యతలను భారంగా మోస్తూ

రేపటి భవితవ్యాన్ని కలలు కంటూ

స్వప్న సాకారానికి స్వేదం చిందిస్తోంది

అమ్మంటే  అనిర్వచనీయమైన బంధం

నిస్వార్థ త్యాగగుణాల సంగమక్షేత్రం

శ్రమైక జీవన సౌందర్యానికి రూపం

భవితకు వెలుగులు దిద్దే కాంతి దీపం

మధురానుభూతుల మమతల నిలయం

పులి జమున

Related posts

అధికార పార్టీ ఎమ్మెల్యేల ఫోన్ ల ట్యాపింగ్?

Satyam NEWS

మోపిదేవి లో శ్రీ ధన్వంతరి సహిత మృత్యుంజయ హోమం

Satyam NEWS

చురుకుగా మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర పనులు

Satyam NEWS

Leave a Comment