33.2 C
Hyderabad
May 3, 2024 23: 09 PM
Slider పశ్చిమగోదావరి

భూ వివాదంలో దాడికి గురైన దళితుల్ని పోలీస్ స్టేషన్ కు ఎందుకు తీసుకెళ్లారు?

#police

ఏలూరు జిల్లా పెదవేగి మండలం కూచింపూడి రెవిన్యూ పరిధిలో ఎస్ సి కార్పొరేషన్ భూ వివాదం శనివారం సాయంత్రం మరోసారి భగ్గుమంది. ఈ భూ వివాదం దళితులకు, ఒక రాజకీయ నాయకుడి కి మధ్య కొంతకాలంగా  కోర్టులో నడుస్తుంది. ఆ భూమి లో ఉన్న పామాయిల్ గెలలు కోస్తున్న విషయం తెలుసుకున్న దళితులు గెలలను తరలించే ట్రాక్టర్ ల ను అడ్డుకున్నారు.

ఈ వివాదం ఇలా జరుగుతుండగానే దళితులలో ఇరువురు యువకులను అక్కడున్న వ్యక్తులు ఆ పొలంలో ఉన్న గృహం లోకి లాక్కెళ్లి నిర్బంధించి వారిపై దాడి చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు దాడికి గురైన వ్యక్తులను జీప్ లో పోలీస్ స్టేషన్ కి తరలించినట్టు తెలిసింది.దె బ్బలు తగిలిన దళిత యువకులను హాస్పిటల్ కి తరలించకుండా స్టేషన్ లో ఉంచడం ఏమిటని దళితులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై స్థానిక ఎస్ ఐ వై వి సత్యనారాయణను వివరణ కోరేందుకు ఫోన్ చేసినా స్పందించలేదు

Related posts

ఘనంగా జరిగిన తీజ్ పండుగ వేడుకలు

Satyam NEWS

నరేంద్ర మోడీ ఎన్నికపై సుప్రీంకోర్టు తీర్పు రేపు

Satyam NEWS

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కోటప్పకొండకు కొత్త హంగులు

Satyam NEWS

Leave a Comment