36.2 C
Hyderabad
May 14, 2024 15: 24 PM
Slider రంగారెడ్డి

వెకిలివేషాలు వేసిన డ్యాన్సు టీచర్ అరెస్టు

DCPSunpreetSinghIPS

ఏదో డ్యాన్సు టీచర్ కదా మర్యాదగా ఉంటాడనుకుంటే అతను ఒక ఛీటర్ గా అవతరించాడు. మహిళలను బ్లాక్ మెయిల్ చేయడం ఈ డ్యాన్సు మాస్టర్ హాబీ గా చేసుకున్నాడు. చివరకు పోలీసులకు దొరికిపోయాడు. హైదరాబాద్ శివారులోని మీర్ పెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగినట్లు ఎల్బీనగర్ జోన్ డీసీపీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు.

మహిళ ల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వారిని వేధిస్తున్న మహమ్మద్ అస్లాం ని మీర్ పెట్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు. మంచాల మండలనికి అరుట్ల గ్రామానికి  చెందిన  మహమ్మద్ అస్లాం ఓ ఇంజినీరింగ్ కాలేజ్ లో  డాన్స్ మాస్టర్ గా పని చేస్తున్నాడు.

ఉప్పల్, కందుకూరు , మీర్ పెట్ పోలీస్ స్టేషన్ లలో ముగ్గురు మహిళ లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేశారు. ఓ ఇంజినీరింగ్ కాలేజ్ లో మహిళ ఫ్యాకల్టి ని అశ్లీల ఫోటోలు ఉన్నాయని 3 లక్షల డిమాండ్ చేశాడు అస్లాం.

మహమ్మద్ అస్లాం పై cr No 762, U/s 384, 354B 417,420, IPC & SEC 67,IT Act 2000 కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తున్నామని ఎల్బీనగర్ జోన్ డీసీపీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు.

మహిళలకు రాచకొండ పోలీసుల విజ్ఞప్తి

మహిళలు ఇలాంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలని,  ఇలాంటి సమస్యలు ఎవరికైనా ఉంటే స్థానిక పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయవచ్చు.. డయల్ 100 కి అయిన ఫోన్ చేయవచ్చు అని, ఫిర్యాదు చేసిన వారి పేర్లు గోప్యo గా ఉచ్చుతమని ఎల్బీనగర్ జోన్ డీసీపీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు.

Related posts

పార్షియల్: స్థానిక పోలీసులపై వైసీపీ ఎంపి ఫిర్యాదు

Satyam NEWS

ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్‌ చిత్రం ‘సీటీమార్‌’ సన్సార్ పూర్తి: రిలీజ్‌కు సిద్ధం

Satyam NEWS

జాతీయ నాయకులకు అందరూ కనీస గౌరవం ఇవ్వాలి

Satyam NEWS

Leave a Comment