37.7 C
Hyderabad
May 4, 2024 13: 26 PM
Slider జాతీయం

ఎగ్జిట్ పోల్స్ : ఢిల్లీలో అధికారం ఆమ్ఆద్మీ పార్టీదే

exit poll

దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. ఢిల్లీ అసెంబ్లీలోని 70 నియోజకవర్గాల్లో  మొత్తం 672 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అధికార పార్టీ ఆమ్ ఆద్మీ, బీజేపీ, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోటీ నెలకొని ఉన్నది. అయితే ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీదే ఢిల్లీ పీఠం అని స్పష్టం చేస్తున్నాయి. 

టైమ్స్ నౌ-ఐపిఎస్ఓఎస్ ఎగ్జిట్ పోల్ ప్రకారం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ 47 సీట్లు గెలుచుకుంటుందని, బీజేపీ 23 సీట్లు సాధిస్తుందని అంచనా వెలువడింది. తన ఖాతాను తెరవడంలో కాంగ్రెస్ మరోసారి విఫలమవుతుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పింది. నెతాన్యుసెక్స్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీకి 53-57, బిజెపి 11 రిపబ్లిక్ జన్ కి బాత్ ఎగ్జిట్ పోల్ ప్రకారం ఆమ్ ఆద్మీ48 -61, బిజెపి 9-21 సీట్లు వస్తాయని అంచనా వేసింది.

Related posts

ముత్య‌పు పందిరి వాహనంపై కాళీయ‌మ‌ర్ధ‌న చిన్నికృష్ణుడు

Satyam NEWS

అగ్లీ ఫెలో: ప్రిన్సిపాల్ దిష్టిబొమ్మ దగ్ధం

Satyam NEWS

ప్రతిపక్ష కూటమికి పోటీగా ఎన్ డి ఏ సమావేశం

Satyam NEWS

Leave a Comment