18.7 C
Hyderabad
January 23, 2025 02: 08 AM
Slider ఆంధ్రప్రదేశ్

గుడ్ న్యూస్: ఏపీలో‌ ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు

polic

ఆంధ్రప్రదేశ్‌లో 18 మంది ఐపీఎస్‌ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. సూపర్‌ టైం స్కేల్‌ ప్రకారం ఐపీఎస్‌లకు జీతాలు పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పలువురు ఐపీఎస్‌ అధికారులకు డీఐజీగా పదోన్నతి కల్పించింది. 1995 బ్యాచ్ అధికారులు అతుల్ సింగ్, ఆర్కేమీనాలకు అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

2002 బ్యాచ్ ఐపీఎస్ అధికారులు సీహెచ్ శ్రీకాంత్, ఎ.ఎస్.ఖాన్, జె.ప్రభాకర్ రావు, డి.నాగేంద్రకుమార్ లకు ఐజీ ర్యాంకు హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 2006 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారులు కె. రఘురామ్, అకె రవికృష్ణ, సర్వశ్రేష్ఠ త్రిపాఠి, ఆర్.జయలక్ష్మి, జీవీజీ అశోక్ కుమార్, జి.విజయకుమార్, ఎస్.హరికృష్ణ, ఎం.రవిప్రకాశ్, ఎస్.వి.రాజశేఖర బాబు, కెవీ.మోహన్రావు, పీహెచ్డీ రామకృష్ణలకు డీఐజీలుగా ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది.

Related posts

బోర్డు మీటింగ్ తిరుమల కొండపై నిర్వహించవద్దు

Satyam NEWS

కంటైన్ మెంట్ జోన్ లోని వారు బయటకు రావద్దు

Satyam NEWS

హైకోర్టు తీర్పును తెలంగాణ ప్రభుత్వం వెంటనే అమలు పరచాలి

Satyam NEWS

Leave a Comment