38.2 C
Hyderabad
May 2, 2024 19: 07 PM
Slider జాతీయం

రిజర్వ్డ్:నిర్భయ కేసులోముగిసిన వాదనలుత్వరలోతీర్పు

nirbhaya cell

నిర్భయ నిందితుల ఉరిశిక్ష ఫై పటియాలా కోర్టు స్టే విధించడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిపి వాదనలు ముగియగానే తీర్పును రిజర్వు చేసింది.ఉరిశిక్ష అమలును ఆలస్యం చేసేందుకు ‘నిర్భయ్ణ దోషులు ఉద్దేశపూర్వకంగా ప్రయత్నిస్తున్నారని కేంద్రం తరఫు న్యాయవాది తుషార్‌ మెహతా అన్నారు. పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టులో విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపించారు.

దోషులకు ఉరిశిక్ష ఆలస్యం కావడం వల్ల ప్రజలకు న్యాయ వ్యవస్థపై నమ్మకం పోతుందన్నారు. వరుసగా పిటిషన్లు వేస్తూ ఈ నలుగురు దోషులూ దేశం యొక్క సహనాన్ని పరీక్షిస్తున్నారన్నారు. నిర్భయపై ఆ నలుగురు అమానవీయంగా వ్యవహరించిన దారుణం యావత్‌ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిందని గుర్తు చేశారు. పవన్‌ గుప్తా అనే దోషి ఇప్పటివరకు క్యురేటివ్‌, క్షమాభిక్ష పిటిషన్‌ పెట్టుకోలేదనీ కావాలనే ఆలస్యం చేస్తున్నాడని కోర్టుకు తెలిపారు.రిజర్వు చేసిన తీర్పు ను రెండు మూడు రోజుల్లో వెలవర్చనుంది.

Related posts

ఒకేసారి 77 మంది డీఎస్పీ లకు స్థానచలనం…!

Satyam NEWS

ఏప్రిల్ 1 న విడుదలవుతున్న “సేవాదాస్”లో నటించడం మాకు గర్వంగా ఉంది!!

Satyam NEWS

పవిత్ర రంజాన్ మాసం శుభాకాంక్షలు: మంత్రి  హరీష్ రావు

Satyam NEWS

Leave a Comment