39.2 C
Hyderabad
April 28, 2024 11: 09 AM
Slider ముఖ్యంశాలు

ఒకేసారి 77 మంది డీఎస్పీ లకు స్థానచలనం…!

#police

విజయనగరం డీఎస్పీ గా కాళిదాసు.. .! చీపురు పల్లి డీఎస్పీ గా చక్రవర్తి….!

ఏపీలో ముందస్తు ఎన్నికలంటూ సోషల్ మీడియా పుణ్యమా పుకార్లు చక్కర్లు కొడుతున్న తరుణంలో నే…రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం… అందుకు ఊతమిచ్చేలా…పోలీసు శాఖలో… దాదాపు 77 మంది డీఎస్పీ లకు స్థానచలం కలిగించింది. ఈ మేరకు తెల్లవారుజామున ఉత్తర్వులు విడుదల చేసింది… రాష్ట్ర పోలీసు శాఖ. ఇందులో ప్రధానంగా గడచిన ఏడాదిన్నర నుంచీ ఖాళీగా ఇంచార్జ్ తో నడుస్తున్న విజయనగరం సబ్ డివిజన్ ను కాళిదాసు కు విజయనగరం డీఎస్పీ గా పోస్టింగ్ ఇచ్చింది… రాష్ట్ర పోలీసు శాఖ.అలాగే సీఎం జగన్ మానసపుత్రిక గా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న “దిశ” పోలీసు స్టేషన్ డీఎస్పీ గా ఇటీవలే వచ్చిన వేంకటేశ్వర్లును ఉన్న పళంగా బదిలీ చేయడం వెనక కారణం ఏంటన్నది…శాఖనే చెప్పాలి. మొత్తానికి ఈ ఏడాది నవంబర్ లో పొరుగు రాష్ట్రం తెలంగాణ లో మాదిరిగా నే జగన్ ప్రభుత్వం… ముందస్తు ఎన్నికలకు వెళ్లొచ్చన్ళ ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో… ఒక్క సారి 77 మంది డీఎస్పీ లను బదిలీ చేయడానికి గల కారణాలేంటని”సత్యం న్యూస్. నెట్” ప్రశ్నిస్తోంది.

Related posts

మువ్వన్నెల జెండా చేతపట్టిన ముస్లిం యువత

Satyam NEWS

ఎయిడెడ్ కాలేజీ విద్యార్ధుల ఆందోళనకు టీడీపీ మద్దతు

Satyam NEWS

సర్వ మతాలూ, కులాలూ ఒకటేనని చాటిన మహాత్ముడు గాంధీజీ

Satyam NEWS

Leave a Comment