23.2 C
Hyderabad
May 7, 2024 19: 10 PM
Slider ముఖ్యంశాలు

ఢిల్లీకి హై అలర్ట్

#Water Commission

యమునా నది 205.33 మీటర్ల డేంజర్ మార్క్ దాటి 206.24 మీటర్లకు చేరకుందని సెంట్రల్ వాటర్ కమిషన్ తెలిపింది. 207.49 మీటర్లు దాటితే తీవ్ర వరదలు వచ్చే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు. నార్తర్న్ రైల్వే అధికారులు పాత యమునా బ్రిడ్జి మీదుగా రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. ఈ నిలిపివేత ప్రక్రియ కొనసాగనుంది. బ్రిడ్జి వద్ద వాటర్ లెవలర్ 206.04ఎంఎంగా ఉంది.

హర్యానా హత్నికుండ్ బ్యారేజ్ నుంచి నీటిని వదలడంతో యమునా నదికి వరద ఉధృతి క్రమంగా పెరగుతోంది. 2లక్షల15వేల 677 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలినట్లు ఫ్లడ్ కంట్రోల్ డిపార్ట్ మెంట్ తెలిపింది. ఢిల్లీలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు అవుతుండగా అన్ని వర్గాల ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

రోజూ వారీ కూలీలు, పేద ప్రజలపై వర్షాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వాటర్ లెవల్ మరింత పెరిగితే యమునా నది పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలను వేరే ప్రాంతాలకు తరలించనున్నారు. ఇప్పటికే పలుచోట్ల కొంత మంది ఇళ్లకు వరద నీరు చేరుకుండటంతో తీవ్ర ఆందోళన నెలకొంది.

Related posts

‘ఆహా’లో వావ్ అనిపిస్తున్నవిక్రమ్ లగడపాటి “వర్జిన్ స్టోరీ”

Bhavani

Hindi Doctors: ఇక నుంచి MBBS పుస్తకాలు హిందీలో….

Satyam NEWS

అనుమానాస్పద పరిస్థితుల్లో వివాహిత మృతి

Satyam NEWS

Leave a Comment