Slider నల్గొండ

దేవరకొండ ఖిల్లా పర్యాటక కేంద్రంగా అభివృద్ధికి కృషి

#MLADevarakonda

నల్లగొండ జిల్లా దేవరకొండ ఖిల్లాను పర్యటక కేంద్రంగా అభివృద్ధికి కృషి చేస్తానని దేవరకొండ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.

ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పర్యటన దినోత్సవం సందర్భంగా ఖిల్లా ప్రత్యేకతకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఖిల్లాలో పార్కు ఏర్పాటుకు రూ.10కోట్లు మంజూరు అయిందని తెలిపారు. ఖిల్లా ఆవరణలో 5ఎకరాల్లో పార్కును ఏర్పాటుకు త్వరలో పనులు ప్రారంభం కానున్నాయని ఆయన తెలిపారు.

ఇప్పటికే ప్రభుత్వం రూ.కోటి మంజూరు చేసిందని రూ. కోటితో సీసీ రోడ్డు నిర్మాణం జరిగిందని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వం పర్యాటక కేంద్రాలను ఏర్పాటుకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది అని తెలిపారు.

ప్రభుత్వం నుంచి ఖిల్లాను పర్యటన కేంద్రంగా ఏర్పాటుకు కావలిసిన నిధులు మంజూరు చేయించి రాష్ట్రంలో నెంబర్ వన్ పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ శిరందాసు కృష్ణయ్య, టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు పున్న వెంకటేశ్వర్లు,గాజుల రాజేష్,ఇలియస్ పటేల్,పగిడిమర్రి శ్రీను,సత్తార్, లక్ష్మీకాంత్,తదితరులు పాల్గొన్నారు.

Related posts

యాదాద్రి లో వైభవంగా రథసప్తమి

Bhavani

74 లక్షల ఖాతాలకు రూ.1500 నగదు బదిలీ రేపు

Satyam NEWS

బాసర సరస్వతీ అమ్మవారి ఆలయ పనులు వేగవంతం

Satyam NEWS

Leave a Comment