40.2 C
Hyderabad
May 6, 2024 17: 55 PM
Slider ఖమ్మం

రూ.18.25 కోట్లతో అభివృద్ది పనులు

#Minister Puvwada

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గ కేంద్రంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విస్తృతంగా పర్యటించారు. రూ.18.25కోట్లతో పలు అభివృద్ది పనులకు ఎమ్మేల్యే హరిప్రియ నాయక్ అధ్వర్యంలో చేపట్టిన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. తొలుత ఇల్లందు కరెంట్ ఆఫీస్ వద్ద రూ.10కోట్లతో ఖమ్మం నుండి ఇల్లందు ప్రధాన రహదారి రోడ్డు విస్తరణ అభివృద్ది, సెంట్రల్ డివైడర్, సెంట్రల్ లైటింగ్ ఎర్పాటు పనులకు శంకుస్థాపన చేశారు.

ఇల్లందు పట్టణం JK కాలని వద్ద రూ.కోటితో నిర్మించనున్న లైబ్రరీ బిల్డింగ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
జగదాంబ సెంటర్ రూ.50 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్ ను మంత్రి పువ్వాడ ప్రారంభించరు.జగదాంబ సెంటర్ నందు రూ.1.50 కోట్లతో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ ను ప్రారంభించారు.

ఇల్లందు బస్ స్టాండ్ ప్రాంగణంలో రూ.3.75 కోట్లతో నిర్మించిన టియస్ఆర్టిసి బస్ డిపో ను ప్రారంభించారు. ఆర్టీసి బస్ స్టాండ్ నందు రూ.1.50 కోట్లతో నిర్మించనున్న సిమెంట్ కాంక్రీట్ ప్లాట్ ఫాం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

అనంతరం డిపో ప్రాంగణంలో ఎర్పాటు చేసిన సభలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు.మంత్రి మాట్లాడుతూ.. ఇల్లందు ప్రజల సౌకర్యార్థం, ఎమ్మేల్యే హరిప్రియ గారి విజ్ఞప్తి మేరకు 3.75 కోట్లు మంజూరు చేసి పూర్తి చేసి ప్రారంభించినట్లు తెలిపారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది స్థానాల్లోనూ బిఆర్ఎస్ అభ్యర్దులు విజయం సాధిస్తారని మంత్రి అన్నారు.
ఆర్టీసీ అంటే ప్రగతికి చిహ్నం అని అన్నారు. ప్రజలకు ఆర్టీసికి ఉన్న బంధం విడదీయలేనిదని పేర్కొన్నారు.

Related posts

ఘనంగా ‘శరపంజరం’ ప్రీ రిలీజ్‌ వేడుక

Satyam NEWS

 తుమ్మల పయనమెటు

Murali Krishna

విద్య, వైద్యం కోసం రాచాల భరోసా యాత్ర

Satyam NEWS

Leave a Comment