31.7 C
Hyderabad
May 7, 2024 03: 03 AM
Slider ఖమ్మం

ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి

#Prabhavani applications

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక జిల్లా అధికారులను ఆదేశించారు.

నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి సమస్యల దరఖాస్తులు స్వీకరించి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులకు ఎండార్స్ చేశారు.

దరఖాస్తులు పరిశీలించిన కలెక్టర్ ఆయా మండలాల తహసిల్దారులతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడి సమస్య యొక్క స్వభావాన్ని తెలుసుకుని పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

చర్ల మండలం, కొత్తపల్లి గ్రామానికి చెందిన బట్ట అనిత భర్త లేటు మంచర్ల జగదీష్ కల్లూరు మండలం, చెన్నూరు గ్రామంలో స్కూల్ అసిస్టెంటుగా పనిచేస్తూ ఎన్నికల విధుల్లో కరోనాతో మరణించారని, కారుణ్య నియామకానికి దరఖాస్తు చేసుకున్నానని కావున తనకు కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగ అవకాశంకల్పించాలని చేసిన దరఖాస్తును తగు చర్యలు కొరకు జడ్పి సిఈఓకు ఎండార్స్ చేశారు.

చర్ల మండలం, కుదునూరు గ్రామానికి చెందిన కె. వెంకటరత్నం కుదునూరు పరిధిలోని సర్వే నెం. 74/ 40.3480 సీతారామ ప్రాజెక్టు నిర్మాణంలో కోల్పోయానని, తన పేరుకు బదులుగా తన అన్న వెంకన్న పేరు వ్రాయుట వలన తనకు పరిహారం అందలేదని పేర్కొంటూ విచారణ నిర్వహించి తనకు పరిహారం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చేసిన దరఖాస్తును తగు చర్యలు నిమిత్తం ఆర్డీఓ భద్రాచలంనకు ఎండార్స్ చేశారు.

ఇల్లందు మండలం,రాఘబోయినగూడెం గ్రామానికి చెందిన ఆమోసు తనకు 26/ఆలో 4.35 కుంటల భూమి కలదని, ఇదివరకు పట్టా కలిగి ఉన్నానని, తనకు నూతన పట్టాదారు పాసుపుస్తకం ఇప్పించాలని చేసిన దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్ తగు చర్యలు నిమిత్తం ఆర్డీఓకు ఎండార్స్ చేశారు.

Related posts

పాత్రుని వలసలో ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి

Satyam NEWS

బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధికి సీఎం జగన్

Satyam NEWS

తిరుమలలో భక్తుల రద్దీ

Bhavani

Leave a Comment