38.2 C
Hyderabad
May 2, 2024 19: 10 PM
Slider ప్రత్యేకం

గుర్తుల గుబులు

కారును పోలిన గుర్తులు టి‌ఆర్‌ఎస్ కు మరోసారి గుబులు పుట్టించాయి. మునుగోడు ఎన్నికలో ఈ గుర్తులు సుమారు అయిదువేలకు పైగా ఓట్లను పొందడం టి‌ఆర్‌ఎస్ మెజారిటీ తగ్గడానికి కారణమైంది. కారును పోలిన గుర్తులు తమ ఆధిక్యానికి గండికొట్టాయని, వాటిని టి‌ఆర్‌ఎస్  కోల్పోయిందని ఫలితం వెల్లడి అనంతరం కేటీఆర్‌ పేర్కొన్నారు. రోటీమేకర్‌ గుర్తుపై పోటీ చేసిన మారమోని శ్రీశైలం యాదవ్‌కు 2,407 ఓట్లు పడగా, రోడ్డు రోలర్‌గుర్తును పొందిన యుగతులసి పార్టీ అభ్యర్థి శివకుమార్‌కు 1,874 ఓట్లు లభించాయి. టెలివిజన్‌ గుర్తు గల లింగిడి వెంకటేశ్వర్లుకు 511, కెమెరా గుర్తుతో పోటీ చేసిన రాజేందర్‌కు 502 ఓట్లు, ఓడ గుర్తు అభ్యర్థి యదీశ్వర్‌కు 153 ఓట్లు  వచ్చాయి. చెప్పుల గుర్తు పొందిన డీఎస్పీ అభ్యర్థి గాలయ్యకు 2,270 ఓట్లు పడ్డాయి. రెండో ఈవీఎంలో ఆ గుర్తు రెండో స్థానంలో ఉంది. మొదటి ఈవీఎంలో తెరాస గుర్తు రెండోదిగా ఉండటంతో చాలా మంది పొరబడి ఆ అభ్యర్థికి ఓటు వేశారని తెరాస నేతలు చెబుతున్నారు.

Related posts

కరోనా చికిత్సలో రెమిడిస్వేర్ ప్రభావం శూన్యం

Satyam NEWS

Pakistan Politics: ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు విదేశీ నిధులు

Satyam NEWS

దోచుకున్నది దాచుకున్నది ఎవరో తేల్చేందుకు సిద్ధమా?

Satyam NEWS

Leave a Comment