27.7 C
Hyderabad
May 4, 2024 10: 07 AM
Slider నల్గొండ

వాహనాల నిర్వహణ పట్ల బాధ్యతాయుతంగా ఉండాలి

#RanganathSP

ప్రభుత్వం కేటాయించిన పోలీస్ వాహనాలను స్వంత వాహనాల మాదిరిగా చూసుకోవాలని, వాటి నిర్వహణ పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని డిఐజి ఏ.వి. రంగనాధ్ సూచించారు. గురువారం నల్లగొండ జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీస్ స్టేషన్ల పరిధిలో వాహనాల నిర్వహణ సక్రమంగా చూస్తున్న పోలీస్ అధికారులకు నగదు రివార్డుతో పాటు డ్రైవర్లకు ప్రశంసా పత్రాలు అందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు నిరంతరం రక్షణ కల్పిస్తూ, శాంతి భద్రతల పరిరక్షణ కోసం పని చేస్తున్న పోలీస్ సిబ్బంది సంఘటనా స్థలాలకు సత్వరం చేరుకోవడం, మహిళలు, విద్యార్థినీల రక్షణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధునిక సౌకర్యాలతో వాహనాలు అందించిందని చెప్పారు.

పెట్రో కార్లు, పోలీస్ స్టేషన్ వాహనాల నిర్వహణ, మంచి కండిషన్ లో ఉండే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత సంబంధిత పోలీస్ అధికారులపైనే ఉన్నదన్నారు. అదే విధంగా డ్రైవర్లు వాహనాలను శుభ్రం చేసుకుని, సక్రమంగా ఉండేలా చూసుకోవడం, వాహనాల మరమ్మత్తుల లాంటి పట్ల శ్రద్ద వహించాలని సూచించారు.

వాహనాలు నడిపే సమయంలోనూ అప్రమత్తంగా ఉంటూ పోలీస్ శాఖ గౌరవం పెంచేలా వాహనాల నిర్వహణ ఉండేలా చూసుకోవాలని సూచించారు. ఇకపై ఎం.టి. ఇన్స్ పెక్టర్ స్పర్జన్ రాజ్ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని పోలీస్ వాహనాల నిర్వహణపై సమీక్ష, తనిఖీలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

వాహనాల నిర్వహణ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన పలువురు పోలీస్ అధికారులపై ఇప్పటికే చర్యలు తీసుకున్నామని ఆయన వివరించారు. వాహనాల నిర్వహణలో జాగ్రత్తలు పాటించి సక్రమంగా చూసుకుంటున్న నల్లగొండ వన్ టౌన్ సిఐ నిగిడాల సురేష్, మిర్యాలగూడ టూ టౌన్ సిఐ శ్రీనివాస్ రెడ్డి, దేవరకొండ సిఐ ఆదిరెడ్డి, చండూర్ ఎస్.ఐ. ఉపేందర్ రెడ్డి, తిప్పర్తి ఎస్.ఐ. సత్యనారాయణ,

మాడ్గులపల్లి ఎస్.ఐ. మోహన్ బాబు, విజయపురి (నాగార్జున సాగర్) ఎస్.ఐ. శ్రీనయ్య, నిడమనూర్ ఎస్.ఐ. కొండల్ రెడ్డి లకు నగదు రివార్డులు అందించి అభినందించారు. వీరితో పాటు డ్రైవర్లు వి. లింగారెడ్డి, ఎన్. శ్రీనివాస్, హరి ప్రసాద్, వెంకన్న, స్వర్ణ నాయక్, నయీమ్, అంజయ్య, కిరణ్, వెంకన్న, జి. రమేష్, గిరీలకు రివార్డులు,

ప్రశంసా పత్రాలు అందించి అభినందించారు. ఎం.టి. ఇన్స్ పెక్టర్ స్పర్జన్ రాజ్ నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ నర్మద, డిఎస్పీలు వెంకటేశ్వర్ రెడ్డి, రమణా రెడ్డి, వెంకటేశ్వర్ రావు, ఆనంద్ రెడ్డి, పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

Related posts

సమస్యల వలయంలో చిక్కుకున్న కేజ్రీవాల్

Satyam NEWS

గరుడవాహనం పై శ్రీ సౌమ్యనాధ స్వామి….

Satyam NEWS

నూతన గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలు పూర్తి చేయాలి

Bhavani

Leave a Comment