28.7 C
Hyderabad
April 27, 2024 06: 27 AM
Slider

ఏసు పుట్టిన ప్రాంతానికి వెళ్లేందుకు ఇజ్రాయిల్ ఆంక్షలు

#Juresalem

పాలస్తీనా క్రైస్తవుల పట్ల ఇజ్రాయిల్ ప్రభుత్వ అనుసరిస్తున్న వైఖరి తీవ్ర విమర్శలకు దారితీస్తున్నది. కరోనా పేరు చెప్పి పాలస్తీనావాసులకు ఇజ్రాయిల్ ప్రభుత్వం బెత్లహేమ్, జెరూసలెం చర్చిలను సందర్శించడానికి నిరాకరిస్తున్నది. ప్రపంచంలోని ఎక్కడెక్కడి క్రైస్తవులకు ఇజ్రాయేల్ వీసాలు జారీ చేస్తోంది.

కానీ తమ దేశంలోని క్రైస్తవులకు అనుమతినివ్వడంలో మాత్రం ఉదారంగా వ్యవహరించడం లేదనే విమర్శలు ఉన్నాయి. గత ఏడాది క్రిస్మస్ సందర్భంగా ఆ చర్చిలను సందర్శించేందుకు 700 మంది ఇజ్రాయేలీ క్రైస్తవులకు మాత్రమే అనుమతి ఇచ్చారు.

ఈ ఏడాది కొవిడ్ కారణంగా బహిరంగ ఉత్సవాలను రద్దు చేసి కేవలం 50 మందితో క్రిస్మస్ వేడుకలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. చాలా మందిని అరెస్టు చేయడం కూడా విమర్శలకు దారి తీస్తున్నది. వెస్ట్ బ్యాంక్, గాజా స్ట్రిప్ ల నుంచి కూడా క్రైస్తవులు రాకుండా నిషేధం విధించారు.

వెస్ట్ బ్యాంకులో 40 వేల మంది పాలస్తీనా క్రైస్తవులు నివాసం ఉంటున్నారు. అదే విధంగా గాజా స్ట్రిప్ లో మూడు వేల మంది క్రైస్తవులు ఉన్నారు. వీరంతా ప్రతి క్రిస్టమస్ కు ఇజ్రాయిల్ వెళతారు అయితే ఈ సారి ఆ విధంగా వెసులు బాటు కల్పించలేదు.

గతంలో కూడా ఆంక్షలు ఎక్కువ కావడం వల్ల వెస్ట్ బ్యాంక్, గాజా స్ట్రిప్ లలో ఉన్న క్రిస్టియన్లు వలస పోవడం ప్రారంభించారని లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఇజ్రాయిల్ ఈ ప్రాంతాలను క్రమంగా ఆక్రమిస్తున్నది. దాంతో అక్కడ ముస్లింల సంఖ్య ప్రతి ఏటా పెరిగిపోతున్నది.

జెరూసలేం లోని గ్రీక్ ఆర్ధడాక్స్ చర్చికి చెందిన ఆర్చి బిషప్ అతల్లా హెన్నా దీనిపై వ్యాఖ్యానిస్తూ పాలస్తీనా లోని క్రైస్తవుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. మానవ హక్కులను ఉల్లంఘిస్తూ పండుగలు కూడా జరుపుకోనివ్వడం లేదని ఆయన అన్నారు.

ఇజ్రాయిల్ లో మత, ప్రార్ధనా స్థలాల వద్ద గోడలు నిర్మిస్తూ దేవుడిని భక్తితో కొలిచే వీలు లేకుండా చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సారి కరోనా పేరుతో ఆంక్షలను మరింత తీవ్రం చేశారు.

Related posts

Safety Tips: ఎక్కడికీ వెళ్లవద్దు ఇంట్లోనే ఉండండి

Satyam NEWS

భక్తి శ్రద్ధలతో గురునానక్ జయంతి వేడుకలు

Satyam NEWS

పిబిఎస్ వృద్ధాశ్రమంలో జయశంకర్ వర్ధంతి

Satyam NEWS

Leave a Comment