27.7 C
Hyderabad
May 4, 2024 07: 21 AM
Slider ఆంధ్రప్రదేశ్

శిలాఫలకాల‌ ఆవిష్కర‌ణ‌లా? శ‌ంకుస్థాప‌న‌లా?

jagan1

ముఖ్యమంత్రి గురువారం పులివెందుల పర్యటన సందర్భంగా నూతన ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాలను ఆవిష్కరించారు. కాగా సదరు అధికారులు సీఎం పర్యటన, శిలాఫలాకాల ఆవిష్కరణ, శంకుస్థాపన అప్పుడే అక్కడే ఉంటారు. ఇక ఆయన పర్యటన ఆసాంతం వివరాలను ముందే పొందుపరుస్తారు.

సీఎం కార్య‌క్ర‌మాల్లో మీడియాకు అనుమ‌తి ఉందా?

ఈ నేపథ్యంలో అధికారులే మీడియాకు తప్పుడు సమాచారం ఇచ్చారా? అసలు ఆయన శిలాఫలాకాల ఆవిష్కరణ, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, ప్రసంగాల్లో మీడియాకు అనుమతినిస్తున్నారా? ఒకవేళ అనుమతి నిస్తే తూతూ.. మమ అనే రకంగా మీడియా చిలువలు పలువలుగా రాసుకు పోవడమే తమ పని కదా అని ఏ కార్యక్రమంలో ఏం తేడా అనేది? ఆలోచించకుండానే రాసేస్తుందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.

ఆవిష్క‌ర‌ణ‌లు.. శంకుస్థాప‌న‌లు ఒక్క‌టేనా!!!

సీఎం శిలాఫలాకాన్నిఆవిష్కరించినట్లుగా స్పష్టంగా కనబడుతోంది. ఈ నేపథ్యంలో పలు మీడియా టీవీలలో, సోషల్ మీడియాలలో శంకుస్థాపనలు అని ప్రచారం చేస్తున్నారు. శంకుస్థాపన అంటే ఒక నిర్మాణానికి పూజలు నిర్వహించి నిర్మాణం చేసేందుకు చేపట్టే కార్యక్రమం అని అర్థం.

శిలాఫలకం ఆవిష్కరణ అoటే ఒక పలకానికి కర్టెన్ (ముసుగుగుడ్డ )వేసి దానిని తొలగించడం అని అర్థం.

ఇక ప్రారంభించడం అంటే సదరు నిర్మాణం పూర్తయి రిబ్బన్ కట్టింగ్ ద్వారానో, లేదా లోపలికి అడుగిడడం ద్వారానో అని అర్థం.

స్ప‌ష్ట‌త ఏంటో తెలియాలంటున్న‌ప్ర‌జ‌లు

ఆయా విషయాలు తెలియకనో? లేదా మీడియాను తప్పుదోవ పట్టించేందుకే అధికారులు ఆ ప్రయత్నాలు చేస్తున్నారో? ఆయా విషయాల్లో చాలామంది శంకుస్థాపన అని చెబుతూండడం విచారకరం. ఇప్పటికైనా ఆయా మీడియా సంస్థలు విషయాన్ని సూటిగా స్పష్టంగా చూసిన తరువాతే స్పందిస్తే త‌మ‌కు స్ప‌ష్ట‌త ఏంటో అని తెలుస్తుంద‌ని ప్రజల్లో వినిపిస్తున్నఅభిప్రాయం.

Related posts

రేజింతల్ వినాయకుడికి మంత్రి హరీష్ ప్రత్యేక పూజలు

Satyam NEWS

పశ్చిమగోదావరిలో బీఎస్ఎన్ఎల్ ఐపీటీవీ సర్వీసు ప్రారంభం

Satyam NEWS

ప్రజాసమస్యల పరిష్కారానికి వార్డు ఆఫీస్ కావాలి

Satyam NEWS

Leave a Comment