27.3 C
Hyderabad
May 10, 2024 10: 43 AM
Slider ముఖ్యంశాలు

నూతన గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలు పూర్తి చేయాలి

#Errabelli Dayakar Rao

నూతన గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలు వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులకు ఆదేశించారు. హైదరాబాద్ లోని సచివాలయం నుంచి జిల్లాల అడిషనల్ కలెక్టర్లు, డీపీవోలు, డీఆర్‌డీవోలతో పంచాయతీరాజ్ కమిషనర్ హనుమంతరావు, స్పెషల్ కమిషనర్ ప్రసాద్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వం అన్ని గ్రామాలను కడిగిన ముత్యంలా చేశారన్నారు. రాష్ట్రంలో 12 వేల 769 గ్రామ పంచాయతీలలో 6,544 గ్రామ పంచాయతీలకు భవనాలు ఉన్నాయన్నారు. మిగతా 6 వేల 225 గ్రామ పంచాయతీలలో నిధులు మంజూరు చేయగా నూతనంగా నిర్మిస్తున్న 3,622 గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.

హరితహారం లో భాగంగా పంచాయతీరాజ్ శాఖ కు 6.7 కోట్ల మొక్కలు నాటే లక్ష్యం ఇవ్వగా, ఇప్పటి వరకు 2.25 కోట్ల మొక్కలు నాటినట్లు మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. మిగతా మొక్కలను కూడా త్వరగా నాటాలని అధికారులను ఆదేశించారు. కొత్తగా వ్యవసాయ భూముల్లో దశాబ్ది సంపద వనాలు ఏర్పాటు చేయాలని సూచించారు.

Related posts

ప్రభుత్వ వైద్యశాలకు శంకుస్థాప‌న చేయ‌నున్నసీఎం

Sub Editor

సీబీఐటి ఆధ్వర్యంలో వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞాన ప్రదర్శన

Satyam NEWS

డిస్ లైక్ లో కొత్త రికార్డు సృష్టించిన సడక్ 2

Satyam NEWS

Leave a Comment