28.7 C
Hyderabad
May 6, 2024 08: 47 AM
Slider ప్రత్యేకం

రేపటి నుంచి కేజీబీవీల్లో ప్రత్యక్ష తరగతులు ప్రారంభం

#telanganaschools

రాష్ట్ర విద్యా శాఖ సంచాలకులు దేవసేన ఆదేశాలతో రేపటి నుంచి నాగర్ కర్నూల్ జిల్లా లోని 20 కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల్లో ప్రత్యక్ష బోధన ప్రారంభించాలని జిల్లా విద్యాశాఖ అధికారి కేజీబీవీల ప్రత్యేక అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

హైకోర్టు గతంలో ఇచ్చిన స్టేను నిలిపివేస్తూ అనుగుణంగా సవరణలు ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కేజీబీవీల్లో రేపటి నుంచే ఆరో తరగతి నుండి 12 తరగతుల వరకు ప్రత్యక్ష తరగతులు ప్రారంభించాలని నిర్ణయించారు.
జిల్లాలోని కేజీబీవీలో ప్రత్యేక అధికారులు, సిఆర్టీలు విద్యార్థినులు ప్రత్యక్ష తరగతులు ఆహ్వానించి వెంటనే తరగతులు ప్రారంభించాలని ఆదేశించారు.

అన్ని కేజీబీవీల్లో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రత్యక్ష తరగతులు నిర్వహించాలని సూచించారు.
విద్యార్థులకు కావలసిన ఆహార పదార్థాలను సంబంధిత టెండర్ దారుల ద్వారా నిత్యవసర సరుకులను సమకూర్చుకోవాలని వంటకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.

తల్లిదండ్రులు తమ అమ్మాయిలను వెంటనే కేజీబీవీ లో నిర్వహించే ప్రత్యక్ష తరగతులకు పంపించాలని వారికి కావలసిన అన్ని సౌకర్యాలను ప్రభుత్వమే కల్పిస్తుందన్నారు.కరోనాతో విద్యార్థినిల సామర్థ్యాలు దెబ్బతిన్నాయని రానున్న పరీక్షలకు వారిని సన్నద్ధం చేసేలా ప్రత్యక్ష తరగతులను నిర్వహించాలని డీఈవో ప్రత్యేక అధికారులను ఆదేశించారు.

Related posts

పశ్చిమ ప్రకాశం పై టీడీపీ స్పెషల్ ఫోకస్

Satyam NEWS

రగులుతున్న కామారెడ్డి:  బండి సంజయ్ అరెస్ట్

Satyam NEWS

జనతా కర్ఫ్యూకు సీఎం జగన్ సంఘీభావం

Satyam NEWS

Leave a Comment