28.7 C
Hyderabad
April 27, 2024 06: 59 AM
Slider నిజామాబాద్

రగులుతున్న కామారెడ్డి:  బండి సంజయ్ అరెస్ట్

#bandisainjai

కలెక్టరేట్ వద్ద పరిస్థితి చేయి దాటుతున్న సమయంలో పోలీసులు బండి సంజయ్ ని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. దాంతో రైతులు, కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అత్యంత ఉద్రిక్త పరిస్థితుల నడుమ బండి సంజయ్ ని పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ వాహనంలో ఎక్కించి తరలిస్తుండగా కార్యకర్తలు, రైతులు పోలీసు వాహనానికి అడ్డుగా నిల్చున్నారు. దాంతో కార్యకర్తలను పక్కకు లాగేస్తూ వాహనాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుండగా కొందరు వ్యక్తులు పోలీసు వాహనం అద్దంపై రాళ్లు, హెల్మెట్ తో దాడి చేయడంతో ముందు వాహనం ధ్వంసమయింది. కార్యకర్తలను పక్కకు లాగేసి బండి సంజయ్ ని అరెస్ట్ చేసి పోలీసు వాహనంలోనే హైదరాబాద్ తరలించారు.

బండి సంజయ్ నేతృత్వంలో కలెక్టరేట్ ముట్టడి

బండి సంజయ్ కామారెడ్డి పర్యటన ఉద్రిక్తతకు దారి తీసింది. బిక్కనూరు టోల్ ప్లాజా వద్ద పోలీసులు అరెస్ట్ చేస్తారని భావించినా అలాంటిదేమి జరగలేదు. పైగా బండి సంజయ్ టూర్ కు పోలీసులు ఎస్కార్ట్ ఇచ్చారు. దాంతో బండి సంజయ్ నేరుగా అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామంలోని రైతు రాములు కుటుంబాన్ని పరమర్శించడానికి బయలుదేరారు. పోలీసు ఎస్కార్ట్ కళ్ళుగప్పి బైపాస్ నుంచి తన కాన్వాయిని కామారెడ్డి జిల్లా కేంద్రంలోకి మళ్లించారు. దాంతో పోలీసులు మున్సిపల్ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బండి సంజయ్ మున్సిపల్ వద్ద ఆగకుండా జిల్లా కేంద్రం నుంచి టెక్రియల్ బైపాస్ మీదుగా అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి వెళ్లి రైతు కుటుంబాన్ని పరామర్శించారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ నేను ఇక్కడినుంచి నేరుగా కలెక్టర్ కార్యాలయనికే వెళ్తున్నా.. కలెక్టర్, మంత్రి సంగతి చూస్తా.. వాళ్ళు ఎలా రారో తేల్చుకుంటా.. కేటీఆర్, కేసీఆర్ వచ్చేదాకా అక్కడినుంచి కధలను అని ప్రకటించారు. దాంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బండి సంజయ్ కలెక్టర్ కార్యాలయానికి వచ్చేలోపు కలెక్టరేట్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బండి సంజయ్ వెంట అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామస్థులు పెద్ద సంఖ్యలో కలెక్టరేట్ వద్దకు చేరుకుని బారికేడ్లను తోసుకుని కలెక్టరేట్ ముందు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో పోలీసులకు, గ్రామస్తులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు, కలెక్టర్ కు వ్యతిరేకంగా రైతులు నినాదాలు చేశారు. ప్రస్తుతం ఆందోళనలో బండి సంజయ్ ఉండటంతో కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి

Related posts

నిష్పాక్షపాతకంగా ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యం

Satyam NEWS

సింహ‌ వాహనంపై శ్రీ మలయప్పస్వామివారు

Satyam NEWS

ప్రజాసేవలో నిమగ్నమైన వారే కమ్యూనిష్టులు

Satyam NEWS

Leave a Comment