33.2 C
Hyderabad
May 4, 2024 02: 20 AM
Slider విజయనగరం

ముగింపున‌కు చేరుకున్న దిశ జాగృతి యాత్ర‌…!

#disaapp

కొత్త‌వ‌ల‌స‌,జామి పాఠ‌శాల విద్యార్దినీల‌కు  చైత‌న్యం…!

గ‌డ‌చిన ప‌దిరోజులుగా విజ‌య‌న‌గ‌రం జిల్లాలో కొన‌సాగుతున్న దిశ జాగృతియాత్ర ముగింపు ద‌శకు చేరుకుంది. రెండు రోజుల క్రిత‌మే విజ‌యన‌గ‌రం డివిజ‌న్  లోప్ర‌వేశించిన దిశ జాగృతి యాత్ర‌…కొత్త‌వ‌ల‌స‌,జామిల‌లో  తిరిగింది. అక్క‌డి హైస్కూళ్ల విద్యార్దినీల‌కు యాత్ర ద్వారా అవ‌గాహ‌న‌,చైత‌న్యం నిర్వ‌హించింది.

ఈ మేర‌కు జామి మండలం, కుమరాం జేడ్పీ హైస్కూల్ లో దిశ జాగృతి బృందం సందర్శించింది. పాఠ‌శాల‌లో విద్యార్థులను సత్ప్రవర్తనతో మెలగాల‌ని కోరింది., ఉన్నత లక్ష్యాలను సాధించాల‌ని.., ప్రలోభాలు, వ్యామోహాలకు స్వస్తి పలకాలని తెలిపింది. మహిళల రక్షణకు ప్రత్యేకంగా రూపొందించిన చట్టాలు, దిశా యాప్ పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించారు.

తాము ఎదుర్కొంటున్న వేధింపులపై విద్యార్థులు ఫిర్యాదు చేసేందుకు దిశా ఫిర్యాదు బాక్సులను పాఠశాలలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో విజయనగరం సబ్ డివిజన్ ఇన్ చార్జ్ అదనపు ఎస్పీ అనిల్ పులిపాటి,  ఎస్.కోట  సిఐ సింహాద్రి నాయుడు, కొత్తవలస  సిఐ బాలసూర్యారావు, జామి ఎస్.ఐ జి.వీరబాబు, గజల్ గాంధీ, రేలారే రేలా జానకి రామ్,  పాఠశాల ఉపాద్యాయులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

విజ‌య‌న‌గ‌రం వంటితాడి అగ్ర‌హారంలో దిశ జాగృతి యాత్ర‌

ఇక విజ‌య‌న‌గ‌రం జిల్లా కేంద్రంలోని , వి.టి.అగ్రహారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల‌ను దిశ జాగృతి బృందం సందర్శించింది.అక్క‌డి విద్యార్ధినీల‌ను క‌లిసింది.ప్ర‌తీ విద్యార్ధినీ ,విద్యార్ధి మంచిగా ఉండాలని  సత్ప్రవర్తనతో మెలగాల‌న్నారు. అల‌గే స‌మోన్న‌త  లక్ష్యాలను సాధించాలని కోరింది.ఎక్క‌డా  ప్రలోభాలు లొంగిపోవ‌ద్ద‌ని..అలాగే వ్యామోహాలకుగురి కావొద్ద‌ని..క్ష‌ణిక సుఖాల‌కు స్వ‌స్థి  పలకాలని పేర్కొంది.

అదే విధంగా  మహిళల రక్షణకు ప్రత్యేకంగా రూపొందించిన చట్టాలు,ముఖ్యంగా పాఠ‌శాల‌,కళాశాల విద్యార్ధినీల‌కై జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప్ర‌త్యేకించి  రూపొందించిన  దిశా యాప్ పట్లవారికి  అవగాహన కల్పించారు. తాము ఎదుర్కొంటున్న వేధింపులపై విద్యార్థులు ఫిర్యాదు చేసేందుకు దిశా ఫిర్యాదు బాక్సులను పాఠశాలలో ఏర్పాటు చేశారు. 

ఈ కార్యక్రమంలో విజయనగరం రూరల్ సి.ఐ టి.ఎస్.మంగవేణి, ఎస్.ఐ నసీమా బేగం, నెల్లిమర్ల ఎస్.ఐ నారాయణ రావు, గుర్ల ఎస్.ఐ శిరీష, గంట్యాడ ఎస్.ఐ కిరణ్ కుమార్ నాయుడు, గజల్ గాంధీ, రేలారే రేలా జానకి రామ్,  పాఠశాల ఉపాద్యాయులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

డెల్టాను ఓమిక్రాన్ దాటేస్తుంది డబ్ల్యూహెచ్ఓ

Sub Editor

హుజూర్ నగర్ లో ఉత్తమ్ పిలుపుతో నిత్యావసరాల పంపిణీ

Satyam NEWS

చంద్రబాబుకు హైకోర్టులో చుక్కెదురు

Satyam NEWS

Leave a Comment