28.7 C
Hyderabad
April 28, 2024 04: 43 AM
Slider నల్గొండ

కేంద్ర ప్రభుత్వం తక్షణమే 12 శాతం గిరిజన రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలి

#hujurnagar

కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో 12 శాతం గిరిజన రిజర్వేషన్ బిల్లును వెంటనే ఆమోదించాలని గిరిజన హక్కుల పోరాట ఐక్యవేదిక సభ్యులు డిమాండ్ చేశారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో బుధవారం గిరిజన హక్కుల పోరాట ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పార్లమెంటులో 12 శాతం గిరిజన రిజర్వేషన్ బిల్లును వెంటనే ఆమోదించాలని ముక్త కంఠంతో నినదించారు.

ఈ సందర్భంగా గిరిజన హక్కుల పోరాట ఐక్య వేదిక నేతలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 12 శాతం గిరిజన రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో ఎకగ్రీవ తీర్మానం చేసి పార్లమెంటుకు పంపితే ఇంతవరకు పార్లమెంటులో ఆమోదం తెలపకుండా కాలయాపన చేస్తున్నారని,కాలయాపన చర్యలు మానుకొని తక్షణమే రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ఆమోదించాలని డిమాండ్ చేశారు. లేనిచో భవిష్యత్కార్యాచరణ ప్రకటిస్తామని,త్వరలో గిరిజన ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోవడానికి కూడా వెనుకడాబోమని అన్నారు. గిరిజన రిజర్వేషన్ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని గిరిజన సమాజానికి న్యాయం చేయాలని ఈ సందర్భంగా కోరారు.

ఈ కార్యక్రమంలో మఠంపల్లి జడ్పీటీసీ జగన్ నాయక్,గిరిజన హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు న్యాయవాది నగేష్ రాథోడ్, సిపిఎం జిల్లా కార్యదర్శి రవినాయక్, సేవాలాల్ కన్వీనర్ వెంకటేశ్వర్లు నాయక్,తులసిరాం నాయక్,నాగరాజు నాయక్,మణికంఠ నాయక్,లకావత్ సైదులు నాయక్,నాగు నాయక్,సైదా నాయక్,బాలు నాయక్,బాణావత్ సైదా, నాగా నాయక్ తదితరులు పాల్గొన్నారు.

త్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

పోలీసులు ప్రవర్తన బాగోలేదు…!

Bhavani

శాఫ్రన్ క్రైమ్: వాడు సన్యాసి కాదు రేపిస్టు

Satyam NEWS

అన్ని మతాల వారికి చేయూతనిచ్చేది టి‌ఆర్‌ఎస్ ప్రభుత్వం

Satyam NEWS

Leave a Comment